Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
No More Big Pictures till 6months

ఈ సంచికలో >> సినిమా >>

ఇదెక్కడి బహిరంగ బూతు ప్రవాహం

If Poonam Pandey was my Teacher?

మోడలింగ్‌ రంగం నుంచి వెండితెరపైకొచ్చిన పూనమ్‌ పాండే, నటనతో వెలగబెట్టినదానికన్నా, న్యూడ్‌ పొటోలతో సంపాదించుకున్న పాపులారిటీ ఎక్కువ. న్యూడ్‌ ఫొటోలకన్నా ముందు న్యూడ్‌ వార్తలతో పాపులారిటీ పొందిందంటే, ఆమె తెలివితేటలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. న్యూడ్‌ భామ అనడం కన్నా పూనమ్‌ పాండేని బూతు భామ అనడం కరెక్టు.

‘పూనమ్‌ పాండే గనుక టీచర్‌ అయితే..’ అని ఓ థ్రెడ్‌ పెడితే, ఆమె అభిమానులు (?) ఇచ్చిన రిప్లయ్స్‌ ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుసా? వినడానికి, చెప్పుకోడానికీ, రాయడానికీ రోత పుట్టించేశాయి. మచ్చుకి ఒకటి. పూనమ్‌ పాండే టీచర్‌గా ‘స్టాండ్‌ అప్‌’ అని చెప్తే, దానర్థం ఇంకోలా తీసుకోవాల్సి వస్తుంది అని ఓ అభిమాని రిప్లయ్‌ పంపాడు. ఇలాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి.

ఇందులో డబుల్‌ మీనింగ్‌ ఏం లేదు. అంతా స్ట్రెయిట్‌ మీనింగే. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ వనిత అంటే ఉన్న గౌరవం వేరు. దాన్ని చెడగొట్టడానికే పూనమ్‌ పాండే లాంటివారు తయారయినట్టున్నారు. ఎలాగైనా పబ్లిసిటీ పొందడానికి వారు చేసే పబ్లిసిటీ జిమ్మిక్స్‌ చాలా అసహ్యంగా ఉంటున్నాయి.

‘గురువు’కి ఉన్న గౌరవం గురించి అయినా ఏమాత్రం ఆలోచించకుండా ‘పూనమ్‌ పాండే టీచర్‌ అయితే’ అనే థ్రెడ్‌ని పెట్టారంటే, సమాజంపై ఎంత బాధ్యత ఉందని అనుకోవాలి? షేమ్‌ ఆన్‌ యూ పూనమ్‌ పాండే.

మరిన్ని సినిమా కబుర్లు
Cheppukondi Chuddam