Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri  question

ఈ సంచికలో >> శీర్షికలు >>

03-02- 2017 నుండి 09-02-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తంమీద చేపట్టు పనుల విషయాల్లో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం బలపడేలా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వారికి అనుగుణంగా పనిచేయుట, అలాగే వారితో కలిసి పనిచేయుట సూచన. మిత్రులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీ ఆలోచనలు మిశ్రమ ఫలితాలు కలుగజేస్తాయి. వాహనాల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. స్త్రీ పరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట అలాగే కుటుంబపరమైన విషయాల్లో వివాదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మెలగడం మంచిది. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును. 

 


 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద ప్రతివిషయంలోను నిదానంగా వ్యవహరించుట అలాగే ఆచితూచి ముందుకు వెళ్ళుట మంచిది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది,జాగ్రత్త. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళుట మంచిది. సంతానపరమైన విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు , కావున వేచిచూసే ధోరణి మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.  

 



మిథున రాశి :  ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను విజయవతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. నూతన ప్రయత్నాలు చేయునపుడు వాటివిషయంలో సరైన అవగహన కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. వారం మధ్యలో తీసుకొనే నిర్ణయాలను వాయిదావేయుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యక్రమాల గురుంచి నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. విదేశీప్రయాణాలు చేయవలసి రావోచ్చును.   

 


కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలతో మీకున్న పరిచయాలను కొంతమేర ఉపయోగించుకొనే ప్రయత్నంలో సఫలీకృతులు అయ్యే ఆస్కారం కలదు. వారంచివరలో మాత్రం పనిఒత్తిడిని కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. మీ మాటతీరు మూలాన మిత్రులతో మనస్పర్థలు రావడానికి ఆస్కారం కలదు, కావున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. అనుకోకుండా చేసే ప్రయాణాలు మీకు ఉపయోగపడుతాయి. 



 సింహ రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన మేర పెట్టుబడులు వచ్చే ఆస్కారం ఉంది. అనుకోకుండా చేసే ప్రయాణాలు నూతన అవకాశాలను కలుగజేస్తాయి, నూతన పరిచయాలకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. గతంలో మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండవలసి వస్తుంది. జీవితభాగస్వామితో ఊహించని విధంగా చిన్న చిన్న విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. అవి పెద్దవి కాకూండా తగిన విధంగా ప్రవర్తించుట మంచిది. విలువైన వస్తువుల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. 

సూచన. 


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు శ్రమించాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు వ్యాపారపరమైన విషయాల్లో వేచిచూసే ధోరణి అలాగే నిర్ణయాలు తీసుకోవడం వారం చివరకు వాయిదావేయుట మంచిది. కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు, బంధువులను కలుస్తారు. బంధువులతో మాటపట్టింపులకు వెళ్ళకండి, అనుకోకుండా చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో మీ మాటతీరు కావొచ్చు అలాగే విధానం వివాదాలకు దారితీస్తాయి. మొత్తం మీద ఈమేరకు సర్దుబాటు విధానం ఆవలంభిస్తారు అనేది మీ చేతిలోని బాణం , జాగ్రత్త. 



తులా రాశి :ఈవారం మొత్తంమీద పనుల విషయంలో ఆరంభంలో ఉన్న ఆసక్తి వారం చివర వరకు ఉండక పోవచ్చును. అనుకోకుండా మీ ఆలోచనల్లో మార్పులకు ఆస్కారం ఉంది వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలు పెద్దగా ఉపయోగపడక పోవచ్చును. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో కీలకమైన నిర్ణయాల దిశగా అడుగులు ముందుకు పడుతాయి. సోదరులతో చేసిన చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, కాస్త దూరదృష్టితో మెలగండి. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. 

 

 



వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద సమయాన్ని మీకు అనుగుణంగా గడపాలనే కోరిక అధికంగా ఉంటుంది. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రయత్నాలు మొదలు పెట్టుట యందు ఉత్సాహాంను చుపిస్తారు. మీ మాటతీరును కొద్దిగా సరిచేసుకోవడం వలన గతంలో మధ్యలో ఆగిపోయిన పనులను ముందుకు తీసుకువెళ్ళుటకు ఆస్కారం ఉంది. తండ్రితరుపు బంధువుల నుండి లేదా తండ్రినుండి ఆశించిన మేర సహకారం రావడం అనేది చక్కటి మార్పు. నూతన ఉద్యోగప్రయత్నాలు గట్టిగా ప్రయత్నించుట ద్వారా లబ్దిని పొందుతారు, ఆలస్యం చేయకండి. చిననాటి మిత్రులను కలుస్తారు, వారితో చర్చలు చేయుట మంచిది.    

 


ధనస్సు రాశి :ఈవారం మొత్తంమీద అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న చిన్న పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వాటిని ఒక్కొక్కటిగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం వేగంగా ముందుకు వెళ్ళుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన పెట్టుబడులు సమయానికి చేతికి అందుతాయి. కాకపోతే అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. అనుకోకుండా చేసే ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రదేశప్రయాణాలు చేయవల్సి వస్తుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు. జీవితభాగస్వామి నుండి ఆశించిన విధంగా సహకారం పొందుటకు ఆస్కారం ఉంది. 

 

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబ పరమైన విషయాలకు సమయం ఇస్తారు. పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. సమయం అధికభాగం ప్రయాణాలకు పోయే అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో వారం చివరలో సంతోషకరమైన వార్తను వింటారు. అనుకోకుండా బంధువులను కలుసుకునే అవకాశం ఉంది, పరిస్థితికి అనుగుణంగా నడుచుకోవడం సూచన. గతంలో మీకు రావాల్సిన మొండిబకాయిలు కొంతమేర వసూలు అయ్యే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న మిత్రులతో కలిసి ముఖ్యమైం నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. 


కుంభ రాశి : ఈవారం మొత్తంమీద సోదరులతో చర్చలు చేయుటకు అలాగే వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం అన్నివిధాలా మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తారు, వాటికోసం కొంతమందిని కలిసే అవకాశం ఉంది. ప్రయాణాలు ఊహించని విధంగా వాయిదాపడే ఆస్కారం కలదు. కొంతమేర ఆరోగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది, జాగ్రత్త. తల్లి తరుపు బంధువుల నుండి వచ్చే ఇబ్బందులు పెరుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. 


మీన రాశి : ఈవారం మొత్తంమీద విలువైన వస్తువుల గురించి ఆలోచనలు పెరుగుతాయి. అలాగే వాటితో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. మిత్రులతో కలిసి స్వల్పదూర ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. అనుకోకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, వాటికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ముఖ్యమ్గా వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలతో స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండుట సూచన. కుటుంబంలో ఆర్థికపరమైన విషయాల గురుంచి చర్చ వచ్చుటకు అవకాశం ఉంది. అందరితో సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది. గట్టిగా చేసే ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి కావున ప్రయత్న తీవ్రత పెంచుట మంచిది. 

మరిన్ని శీర్షికలు
cartoon compitetion