Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

తెలుగువాళ్లు స్వార్థపరులా.. - సిరాశ్రీ

 
 
1. పరభాషానటులు, గాయకులు తెలుగు సినిమాని పాడుచేస్తున్నారు. మన దగ్గర నటులే లేనట్లు పక్క రాష్ట్రాల నుంచి అరువు తెచ్చుకుంటున్నారు మన దర్శకులు. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దీనిని తిప్పికొట్టాలి. 
 
2. మన నటులు, గాయకులు పరభాషల్లో పాడితే "మన వాళ్లు సరిహద్దులు దాటి తెలుగు వారి కీర్తిని పెంచుతున్నారు" అంటాం. పరభాషవాళ్లు మన భాషలో పాడినప్పుడు వాళ్ల రాష్ట్రాల వాళ్లు అలా గొప్పగా అనుకునే అవకాశం మనం ఇవ్వమా? తెలుగువాళ్లు అంత స్వార్థపరులా? మనం చేస్తే గొప్ప, మనదేశంలోనే వేరే రాష్ట్రాల వాళ్లు చేస్తే తప్పా? ఇది తెలుగువారి సంకుచిత స్వభావం. మనం అందర్నీ స్వాగతించాలి, మన వాళ్లు అన్ని చోట్లకీ విస్తరిచాలి. 
 
పై రెండిట్లో ఏది కరెక్ట్?
మరిన్ని శీర్షికలు
traditional artical