Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty ok kashmir

ఈ సంచికలో >> శీర్షికలు >>

10-02- 2017 నుండి 16-02-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద మీరు తీసుకొనే నిర్ణయాల వలన పెద్దలకు సమాధానం చెప్పవలసి రావోచ్చును. ఉద్యోగంలో సమయపాలన పాటించుట అలాగే అధికారుల ఆలోచనలకు అనుగున్మగా నడుచుకొనుట మంచిది. దూరప్రదేశప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మిత్రులతో మీకు అనుకోకుండా మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం ఉంది. సంతానపరమైన విషయాల్లో ఒకింత ఆందోళలనకు గురయ్యే ఆస్కారం కలదు. కుటుంబపెద్దలతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే దిశగా అడుగులు ముందుకు పడుతాయి.

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు కలిగే ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో అధికారులతో కలిసి చర్చలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడపాలనే ఆలోచన ఉంటుంది. స్త్రీ పరమైన విషయంలో ఆచితూచి వ్యవహరించుట మంచిది. అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశించిన మేర సహకారం లభిస్తుంది.    

 

 



మిథున రాశి :  ఈవారం మొత్తంమీద మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన వాటిని విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆలోచనావిధానంలో స్వల్పమార్పులను చేసుకోవడం వలన మరింత అనుకూలమైన మార్పులకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశము ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. పెద్దలతో మీకున్న ఆర్థికపరమైన సంభందాలు మరింత బలపడే అవకాశం ఉంది. మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది.  

 


కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు ఇబ్బందులు తప్పకపోవచ్చును. కుటుంబంలో పెద్దలనుండి వచ్చిన సూచనల విషయంలో మరొకసారి ఆలోచన చేయుట సూచన. ఆరోగ్యపరమైన విషయాల్లో ఆశించిన పురోగతి ఉండకపోవచ్చును. తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. దూరప్రదేశప్రయాణాలు అనుకోకుండా వాయిదాపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయంలోపెట్టుబడుల విషయంలో పెద్దలతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. 



 సింహ రాశి : ఈవారం మొత్తంమీద బంధువులను కలుస్తారు. వారి అభిప్రయాలను పరిగణలోకి తీసుకోవడం, వాటి గురుంచి కుటుంబంలో చర్చచేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. నూతన ఉద్యోగం విషయంలో శ్రమించుట ద్వారా ఒకింత అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దల ఆలోచనల మేర ముందుకు వెళ్లడం మంచిది. గతంలో మొదలుపెట్టిన విదేశీప్రయత్నాలు సానుకూల పడుతాయి. ఆరోగ్యం విషయంలో బద్ధకం వీడటం వలన మేలుజరుగుతుంది. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి .

 

కన్యా రాశి :ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. సంతానం వలన పెద్దలలో మంచి గుర్తింపును పొందుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో తీసుకొనే నిర్ణయాల్లో స్పష్టత ఉండుట ముఖ్యం. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో చేపట్టిన పనులను మిత్రుల సహకారంతో పూర్తిచేసే ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగప్రయత్నాలు గట్టిగా ప్రయత్నించుట వలన సానుకూలఫలితాలు పొందుతారు. కొన్ని కొన్ని విషయాల్లో మీ మొండినిర్ణయాలు మిమ్మల్ని నిలబెట్టే అవకాశం ఉంది.



తులా రాశి :ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధంచేసుకోవడం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేయుప్రయత్నాలు మిశ్రమఫలితాలు ఇస్తాయి. కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. తండ్రితరుపు బంధువుల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. విలువైన వస్తువుల కోసం ధనం ఖర్చుచేస్తారు. జీవితభాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్తపడటం మంచిది. రుణపరమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడటం సూచన.

 

 



వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులతో కలిసి అధికసమయం కేటాయిస్తారు. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. కుటుంబంలో వివాదాలు రాకుండా సభ్యుల మధ్య మనస్పర్థలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సోదరులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. 


ధనస్సు రాశి ఈవారం మొత్తంమీద తీసుకొనే నిర్ణయాల విషయాల్లో స్పష్టత లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్పఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు వాయిదాపడే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మీ మాటతీరు మూలాన నూతన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. సర్దుబాటు విధానం కలిగి ఉండుట కుటుంబంలో సాధయమైనంత వరకు అనవసరమైన చర్చలు రాకుండా జాగ్రత్త పడటం సూచన. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. 

 

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద చర్చలకు దూరంగా ఉండుట సూచన. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. నూతన నిర్ణయాల విషయంలో అనుభవజ్ఞుల సూచనలు అలాగే పెద్దల అనుభవాలు మీకు ఉపయోగపడుతాయి. స్వల్పదూరప్రయాణాలు వాయిదాపడే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మధ్యవర్తిత్వం విషయంలో ఎంత దూరంగా ఉంటె అంత మంచిది, సర్దుబాటు విధానం మంచిది. 


కుంభ రాశి : ఈవారం మొత్తంమీద నూతన పనులను చేపట్టుటకు ఉత్సాహంను చూపిస్తారు. ఉద్యోగంలో చర్చలకు అవకాశం కలదు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. మిత్రులతో మీకున్న పరిచయం మరింత బలపడే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఊహించని మార్పులకు అవకాశం కలదు. ఆరోగ్యంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. బంధువుల నుండి వచ్చిన సూచనల విషయంలో స్పష్టత అవసరం. సంతానం వలన నలుగురిలో ఆశించిన మేర గుర్తింపును పొందుటకు అవకాశం కలదు.  

మీన రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకోండి. మీ ఆలోచనలను వారితో పంచుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. వారితో చేసిన చర్చలు నూతన మార్పులకు అవకాశం కల్పిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆశించిన మేర పెట్టుబడులకు ఆస్కారం ఉంది. మిత్రులతో చర్చలు చేస్తారు, సరదాగా గడపాలనే కోరిక ఉంటుంది.  

మరిన్ని శీర్షికలు
chidambara rahasyam