Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
trump

ఈ సంచికలో >> యువతరం >>

వర్కవుట్స్‌కీ స్మార్ట్‌ పద్ధతుంది

work outs

ప్రపంచం చాలా స్మార్ట్‌గా తయారవుతోంది. యువతరం ఆలోచనలు ఎప్పుడూ స్మార్ట్‌గానే ఉంటాయి. అలాంటి యువతరాన్ని ఇంకా స్మార్ట్‌గా మార్చేందుకు మార్కెట్‌లో 'స్మార్ట్‌ డివైజెస్‌' ఎన్నో అందుబాటులోకి వచ్చేశాయి. టైమర్‌ దగ్గర్నుంచి, హార్ట్‌ బీట్‌ని కొలిచే డివైజెస్‌ అందులో ఉన్నాయి. మన శరీరతత్వాన్ని బట్టి వర్కవుట్స్‌ని ఎంచుకునేందుకు ఈ స్మార్ట్‌ డివైజెస్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రతిరోజూ వేకవజామునే ఓ ఇరవై నిమిషాలపాటు వర్కవుట్స్‌ చేస్తే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలా పొద్దున్నే లేవడం దగ్గర్నుంచి, ఎంత టైమ్‌లో ఏయే వర్కవుట్స్‌ చెయ్యాలో స్మార్ట్‌ డివైజెస్‌లో ఫీడ్‌ చేసేస్తే, ఆ సమయానికి అది మనల్ని అలర్ట్‌ చేసేస్తుంటుంది.

ఎన్ని క్యాలరీలు బర్న్‌ చేశాం, ఎంత బరువు తగ్గాం, ఈ క్రమంలో హార్ట్‌ బీట్‌ ఎలా ఉంది? వంటివన్నీ చెప్పేసే డివైజెస్‌ మిమ్మల్ని స్మార్ట్‌గా మార్చుతాయనడంలో సందేహం లేదు కదా. స్మార్ట్‌ డివైజెస్‌ మాత్రమే కాదు, స్మార్ట్‌ ఫోన్లలో స్మార్ట్‌ యాప్స్‌ కూడా మీ ఫిట్‌నెస్‌పై మీలో అవగాహన పెంచుతున్నాయి. లెక్కకు మిక్కిలిగా ఈ యాప్స్‌ అందుబాటులో ఉంటుండడం అభినందించదగ్గ అంశమే.  ఇప్పుడు అందుబాటులో ఉన్న స్మార్ట్‌ టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోతే ఎలా? భవిష్యత్‌ ఇంకా చాలానే ఉంది. ఇప్పటికే ప్రయోగాత్మక దశలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్‌ డివైజెస్‌ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. హార్ట్‌ బీట్‌ని చెప్పడం మాత్రమే కాదు, హృదయ సంబంధిత ఇబ్బందులతో బాధపడేవారి గురించీ, అలాగే ఇతరత్రా అనారోగ్య సమస్యల గురించీ ఈ స్మార్ట్‌ డివైజెస్‌ ఇట్టే పూర్తి సమాచారాన్ని మీకు అందించేస్తాయి. భవిష్యత్తులో డయాగ్నస్టిక్స్‌ సెంటర్స్‌ వెళ్ళకుండా, ఇంట్లోంచే ఈ డివైజెస్‌ ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరే పూర్తిగా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి కొన్ని డివైజెస్‌, యాప్స్‌ పుట్టుకొస్తున్నప్పటికీ వాటి విశ్వసనీయతపై అనుమానాలున్నాయి. సమీప భవిష్యత్తులోనే ఆ అనుమానాలకు నివృత్తి దొరకవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. 

అయితే అతి సర్వత్ర వర్జయేత్‌ అని పెద్దలు అన్నారు కదా. దేన్నయినా పరిమితికి లోబడి వాడితేనే మంచిది. ఎందుకంటే, స్మార్ట్‌ ఫోన్ల కారణంగా తలెత్తే రేడియేషన్‌ సమస్య భవిష్యత్తులో పెను ప్రమాదకారిగా మారనుంది. అలాగే, స్మార్ట్‌ డివైజెస్‌లో వాడే విడి భాగాల వలన ప్రపంచం మరింత కాలుష్యం బారిన పడే ప్రమాదముందంటున్నారు పర్యావరణవేత్తలు. ఇప్పటికే మొబైల్‌ ఫోన్లలో వాడే బ్యాటరీల్ని కాలం చెల్లిన తర్వాత ఇష్టానుసారం ఎక్కడంటే అక్కడ పడేయడం ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పర్యావరణ విధ్వంసం జరిగిపోతోంది. టెక్నాలజీని ఆహ్వానించాల్సిందే. అదే సమయంలో మనం కూడా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చూపిన స్మార్ట్‌నెస్‌, వాటి వినియోగంలోనూ, డివైజెస్‌ నిరుపయోగంగా మారాక వాటిని సరైన పద్ధతుల్లో ధ్వంసం చేయడంలోనూ కూడా చూపితే మంచిది.

మరిన్ని యువతరం