Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mehrene kaur got many chances

ఈ సంచికలో >> సినిమా >>

తిరుగులేదు

nani  speed increase

నాని జోరుకు ఈ మధ్య అడ్డే లేకుండా పోయింది. నాని నుండి వచ్చిన ప్రతీ సినిమా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంటోంది. అది కూడా అలాంటి ఇలాంటి హిట్‌ కాదు. ఓ స్టార్‌ హీరో సినిమా మాదిరిగా వసూళ్లు సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ ఏడాది నాని 'నేను లోకల్‌' సినిమాతో మన ముందుకు వచ్చాడు. ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ ఈ సినిమాలో నానికి జంటగా నటించింది. ఈ సినిమాలో నాని నటన గురించి సినీ ప్రముఖులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాని నటన గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమాతో నానికి బీభత్సమైన ఫాలోయింగ్‌ వచ్చేసింది. ఇకపోతే ఓవర్సీస్‌లో కూడా నానికి తిరుగులేదు. మంచి వసూళ్లు సాధిస్తున్నాడు. స్టడీ మార్కెట్‌ని సొంతం చేసుకున్నాడు నాని ఓవర్సీస్‌లో. నాని సినిమాల అక్కడ పోటీ పెరిగింది.

గత చిత్రాలతో పోలిస్తే నాని 'నేను లోకల్‌' సినిమా బాగా ఆకట్టుకుంటోంది. ఓ మామూలు స్టోరీనే అయినా కానీ నాని తన నటనతో ఈ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. అలాగే ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ నటన ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. ఆమెకు తెలుగులో ఇది రెండో సినిమానే అయినా కానీ నానితో పోటీపడి తన యాక్టింగ్‌ టాలెంట్‌ని నిరూపించుకుంది. అలాగే లక్కీ మస్కట్‌ కీర్తి సురేష్‌ అనే విషయాన్ని మరోసారి ప్రూవ్‌ చేసుకుంది. మొత్తానికి ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా ఎక్కడైనా నువ్వు సూపర్‌హే అన్పించుకున్నాడు నేచురల్‌ స్టార్‌ నాని. 

మరిన్ని సినిమా కబుర్లు
NTR biopic