Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
satya sai baba information

ఈ సంచికలో >> శీర్షికలు >>

కార్టూనిస్ట్ పద్మ నిర్వహించిన పెళ్ళి కార్టూన్ల పోటీ - నాగ్రాజ్

cartoon competetion

అది విజయవాడ నగరంలో  స్వాతి థియేటర్స్  దగ్గర కళ్యాణ మండపము  అక్కడ అంత సందడి  గా ఉంది , మంగళ వాయిద్యాలకి బదులు నవ్వులు వినిపిస్తున్నవి , పెళ్ళి కి వచ్చిన  అమ్మలక్కలు తమనగల ముచ్చట్లు వదిలేసి   నవ్వుల్లొ మునిగి పొయారు,మంగళ  వాయిద్యాల చప్పుడు మరుగున పడిపోయింది  , హాలంతా  నవ్వులతొ మారుమొగి పొసాగిన్ది .  అసలె విజయవాడ నగరానికి కొత్త గా వచ్చిన నాకు  కళ్యాణమండపం  ఎక్కడా అని వెతుకుతుంటె ఇ నవ్వులు నా పని సులభం చెశాయి.  కార్టూను ఎగ్జిబిషన్  జరుగుతున్న  పద్మ గారి అబ్బాయి పెళ్లి మండపము యిదె నని తెలుసుకోడానికి నాకు అట్టె సమయం పట్ట లెదు. 

    ఆ సాయంత్రం   కళ్యాణ మండపంలో ఒక పక్కన పెళ్లి అంశం పైన పద్మ కార్టూనిస్టు గారు నిర్వహించిన పోటీ లో పాల్గొన్న కార్టూనిస్టుల కార్టూన్లన్నీ ప్రదర్శన కు ఉంచారు బహుమతి పొందిన కార్టూన్లతో పాటు . 

పెళ్ళికి వచ్చిన అతిథులంతా కార్టూన్లని చూసి ఆస్వాదిస్తూ , నవ్వుల్లో మునిగి పోయారు . పెళ్లంటే మంగళ వాయిద్యాలు,అలంకారాలు,నగలు,ముచ్చట్లు,అలకలు, వయ్యారాలు,వెటకారాలు, భోజనాలు, ఏడు అడుగులు, మూడు ముల్లె కాదు ,  వంద నవ్వులు , వేల ఆనందాలు అని నిరూపించింది ఈ పెళ్లి వేడుక . 

పెళ్లి కి విచ్చేసిన కార్టూనిస్టులు సర్వశ్రీ ఏ . వి . ఎం . గారు, బాచి గారు,కళాసాగర్ గారు , శేఖర్ గారు, నాగిశెట్టి గారు, జమదగ్ని గారు,జి.సి. పద్మదాసు గారు, రామకృష్ణ గారు, నాగ్రాజ్ గారు  మరియు హాస్యానందం మాస పత్రిక సంపాదకులు రాము గారు శ్రీమతి పద్మ గారు ఏర్పాటు చేసిన విందు , నవ్వులవిందు మనసారా ఆస్వాదించి వధూ వరులని మనసారా ఆశీర్వదించి ,ఒకరికొకరు మనసులు విప్పుకుని ఎన్నో ఆత్మీయతలు , ఆనందాలు, మధుర స్మృతులు నెమరు వేసుకుని, మరిన్ని స్మృతులు పోగు వేసుకుని బయలు దేరారు , శ్రీమతి పద్మగారి పోటీ కార్టూన్లతో కూడిన బుక్లెట్ చేతిలో అలంకరించుకుని.

మరిన్ని శీర్షికలు