Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
satya sai baba information

ఈ సంచికలో >> శీర్షికలు >>

17-02-2017 నుండి 23-02-2017 వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి :  ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండుట సూచన. సంతానపరమైన విషయాల్లో మీ ఆలోచనలను కుటుంబపెద్దలతో పంచుకుంటారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఈ విషయంలో అన్నివిధాలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వాహనాల వలన కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు.


పూజ ..... గణపతిఆరాధన                                         

సమయం ...... పగలు                                                

రంగు .......మెరున్

 

 వృషభ రాశి : ఈ రోజు మీరు బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. సంతానం విషయంలో ఒకింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. కుటుంబపరమైన విషయాల్లో సర్దుబాటు విధానం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది.

పూజ .....దుర్గాదేవిఆరాధన                          

సమయం ......ఉదయం                                  

రంగు ......  పసుపు 

 

 



మిథున రాశి :  ఈ వారం మొత్తంమీద ఆరంభంలో ఒకింత ఇబ్బందులు ఎదుర్కొన్న చివరకు వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే విషయంలో తొందరపాటు వద్దు. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యక్రమాలు జరుగుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. విదేశీప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. గట్టిగా ప్రయత్నించుట ద్వారా మరింత ఉన్నతమైన ఫలితాలు పొందుటకు ఆస్కారం కలదు.

పూజ .....దత్తాత్రేయఆరాధన                                           

సమయం ...... ఉదయం                                                        

రంగు ....నారింజ

 


కర్కాటక రాశి : ఈ వారం మొత్తంమీద అధికంగా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, సమయాన్ని అధికభాగం వాటికి కేటయిస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో మిశ్రమఫలితాలు పొందుతారు. మీ ఆలోచన ధోరణి కొంతమందికి నచ్చకపోవచ్చును, కాస్త ఆచితూచి వ్యవహరించుట మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. వారం చివరలో మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.

పూజ .....వేంకటేశ్వరఆరాధన                                              

సమయం ...... ఉదయం                                                      

రంగు ......నీలం



 సింహ రాశి : ఈ వారం మొత్తంమీద ఆరంభంలో చూపిన ఉత్సాహాన్ని చివరి వరకు కొనసాగించక పోవచ్చును. అనుకోకుండా దూరప్రదేశంలో ఉన్న మిత్రుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సంతానపరమైన విషయాల్లో మాత్రం అనుభవజ్ఞుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు.

 

పూజ .....శివఆరాధన 
                        
సమయం ......
పగలు                                   

రంగు .....భూడిద

 

కన్యా రాశి : ఈ వారం మొత్తంమీద నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సందిగ్దత ఎదుర్కొంటారు. పెద్దలతో మీకున్న అనుభందం పెరిగేలా ఆలోచనలు చేయుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. మీనిర్ణయాలను పెద్దలతో పంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, కొన్ని కొన్ని విషయాల్లో సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. మిత్రులతో లేకా అధికారులతో మనస్పర్థలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దూరదృష్టిని కలిగి ఉండుట సూచన.

 

పూజ .....లక్ష్మీనరసింహాఆరాధన                                          

సమయం ......  పగలు                                                     

రంగు ......సింధూరం



తులా రాశి : ఈ వారం మొత్తంమీద మిత్రులతో లేకా ఆత్మేయులతో సమయం గడిపే అవకాశం ఉంది. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు దిశగా అడుగులు ముందుకు పడుతాయి. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. వివాదాలకు మూలబిందువు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

 

పూజ ..... ఆంజనేయఆరాధన                                      

సమయం ......సూర్యోదయవేల                                                   

రంగు ..... బంగారువర్ణం

 


వృశ్చిక రాశి : ఈ వారం మొత్తంమీద ఉద్యోగంలో పనిఒత్తడిని పొందుతారు. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు ఇబ్బంది పడవలసి వస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే విషయంలో ఏమాత్రం తొందరపాటు పనికిరాదు, నిదానంగా ఆచితూచి వ్యవహరించుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు మిశ్రమఫలితాలు వస్తాయి. మిత్రులతో కలిసి చేపట్టు పనులను వాయిదా వేయుట మంచిది. శరీరానికి తగిన విశ్రాంతి వచ్చేలా ప్రయత్నం చేయుట మంచిది.

 

పూజ .....దక్షిణామూర్తిఆరాధన                                            

సమయం ......  సాయంత్రం                                  

రంగు ......లేతఎరుపు     

 


ధనస్సు రాశి : ఈ వారం మొత్తం మీద కీలకమైన పనులను చేపట్టుటకు ముందుగా వెళ్ళుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో స్పష్టమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విదశీప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో అధికారుల నుండి రావాల్సిన పూర్తిస్థాయి సహకారం అందుటకు అవకాశం ఉంది. సోదరులతో చర్చలు చేయునపుడు కాస్త నిదానంగా వ్యవహరించుట మంచిది, వారి ఆలోచనలు తెలుసుకొనే ప్రయత్నం చేయుట మంచిది.

పూజ .....సుబ్రమణ్యఆరాధన                               

సమయం ...... సుర్యోదయవేల                                     

రంగు ......ముదురు గోధుమరంగు

 

 

మకర రాశి : ఈ వారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. పెద్దలతో కలిసి ముఖ్యమైన చర్చలకు అవకాశం ఉంది. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకొంటారు. ఆత్మీయులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒకింత ఇబ్బందికి గురిచేసే ఆస్కారం కలదు.

పూజ ..... సాయిబాబాఆరాధన                                       

సమయం .....సుర్యోదయవేల                                                  

రంగు .....ఆకుపచ్చ


కుంభ రాశి : ఈ వారం మొత్తంమీద అధికారులతో లేక పెద్దలతో సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనులను పూర్తిచేసే క్రమంలో నూతన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్య పరమైన విషయాల్లో అనారోగ్యసమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. గతంలో మీకు రావాల్సిన ధనం చేతికి సమయానికి అందకపోవచ్చును. విలువైన వస్తువులను కొనుగోలు చేయడంలో నస్టపోయే ఆస్కారం ఉంది, జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మీరు తీసుకొనే నిర్ణయాలు కొంతమందికి నచ్చకపోవచ్చును. వాహనాల వలన ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంది జాగ్రత్త.

పూజ .....లక్ష్మీదేవిఆరాధన                                         

సమయం ...... ఉదయం                                                     

రంగు ......తెలుపు


మీన రాశి :  ఈ వారం మొత్తంమీద ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేయుటకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడే అవకాశం ఉంది. అధికారులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారినుండి పూర్తిస్థాయి సహకారం రాకపోవచ్చును. కుటుంబంలో తండ్రి తరుపు బంధువులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. అనుకోకుండా మీ ప్రయాణాలు వాయిదాపడే ఆస్కారం కలదు. చర్చలకు అవకాశం ఇవ్వకండి.  

పూజ .....రాఘవేంద్రస్వామిఆరాధన                                      

సమయం ...... సాయంత్రం                                                  

రంగు ......ఎరుపు

 

మరిన్ని శీర్షికలు
amarnath yatra