Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

కథా సమీక్షలు - ..

కథ : నడుస్తున్న చరిత్ర
 రచయిత :  ఆదెళ్ల శివకుమార్ 
సమీక్షకులు  కర్రా నాగలక్ష్మి 

గోతెలుగు  51 వ సంచిక!

 

కథ చదివిన తరువాత పాఠకుడిలో ప్రశ్నలు చెలరేగుతాయి . మంచి కథ అంటే పాఠకుడికి పుస్తకం మూసేసిన తరువాత కూడా గుర్తుండాలి అంటారు కాని ఈ కథ గుర్తించడం కాదు , ఆలోచింప జేస్తూ వుంటుంది .

కథ శ్మశానం తో మొదలవుతుంది , మండుతున్న చితి తాలూకు మంటలు అందరినీ కాలుస్తూ వుంటాయి . ఎవరి దుఃఖం వారిది . అందవలసినంత సొమ్ము అందలేదనేది అందుకు కారణం , అంతేకాని చితిలో కాలుతున్న శవం గురించి యెవరికీ బాధలేదు , యెవరి ఆలోచన వారిది , కాని నానాగడ్డి కరిచి జీవితాంతం కూడబెట్టినది యెంత తీసుకు పోగలిగేడు అనేది యెవ్వరికీ తోచదు . మనంచేసుకున్న మంచిగాని చెడుగాని మాత్రమే మనతో వస్తుంది అనే ఆలోచన అక్కడవున్న యెవ్వరిలోనూ వుండదు . 

కథ గురించి చెప్పను మీరు చదవాలిగా ?

శ్మశానంలో వున్నంత సేపు ప్రతీ మనిషికి జీవితం మీద విరక్తి కలుగుతుంది అనేవారు , ఆ వైరాగ్యం అక్కడవున్న యెవ్వరిలోనూ కలుగలేదు  దీని వల్ల మన జీవన విధానంలో యెంత మార్పు వచ్చింది , ఆలోచనలు యెంత కలుషిత మయేయి అనేది మనకు అవగతమవుతోంది .
సమాజంలో మొక్కగా మొలిచి వేళ్లూనుకొన్న విషవృక్షాలను కొమ్మలతోను , రెమ్మలతోను , ఆకులతోను చిగుళ్లతోను పరిచయం చేసేరు రచయిత .

కొత్త విషయం కాదు , అందరికీ తెలిసినవే అని అనిపిస్తాయి ఒక్కో సంఘటన చదువుతూ వుంటే .

మనం రోజూ చూస్తున్నవే , చూసి చూసి మనం యెంత అలవాటు పడ్డామంటే మరొకళ్లు తప్పు అని చెప్పేంత వరకు అది తప్పని తోచదు , ఒకొక్కప్పుడు మనం యే బిసి కాలంలోనో ఆగిపోయేమేమో , కాలంతో పాటు మనం ముందుకు వెళ్లడం మరచి పోయేమేమో అని అనిపిస్తూ వుంటుంది . ఇలాంటి కథలు చదివి నప్పుడు ' అయ్యో యివన్నీ తప్పులే సుమా ' అని అనిపిస్తూ వుంటుంది . 
         ఈ కథలో రచయిత ప్రస్తావించిన  అంశాలన్నీ నిత్యం మన దేశం లో జరుగుతున్నవే , అందుకే కథ శీర్షిక ' నడుస్తున్న చరిత్ర ' అని పెట్టేరేమో ?

ముగింపులో తాత మొక్కను నాటుతున్నప్పుడు మనుమడు వేసిన ప్రశ్నకు సమాధానంగా ఫలాలు తాను తినాలని కాదని తాను తన తాత తండ్రులు నాటిన వృక్షాల పండ్లు అనుభవించానని , తాను నాటే వృక్షాల పండ్లు తరవాతి తరం వారు తింటారని చెప్పడం లో నాకు రెండు విషయాలు అనిపించేయి , వొకటి నేను తప్ప అనుకొనే బదులు నేను సైతం అనుకుంటే మనదేశం యెప్పుడో బాగుపడేది . రెండోది చిన్నతనం లోనే మంచిచెడు మనం పిల్లలకి చెప్పగలగితే రాబోయే తరాల ' నడుస్తున్న చరిత్ర ' మారుతుందేమో అని .

ఈ కథ లో అన్నీ నిజాలే చదువుతాం , కల్పితం అన్నది లేనేలేదు . ఈ కథలో రచయిత పరిష్కారం చదువరులకే వదిలేశారు . 

ఈ కథని విశ్లేషించలంటే యెన్ని గంటలయినా చాలవు .

చదివిన తరువాత నా కనిపించనట్లే మీకూ అనిపిస్తే కామెంటండి , లేదా ఓ లైకేసుకున్నా చాలు .
 

 

ఈ క్రింద లింకులో ఈ కథ చదివెయ్యండి మరి... http://www.gotelugu.com/issue51/1403/telugu-stories/nadustunna-charitra/

 

 

మరిన్ని శీర్షికలు
sarasadarahasam