Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri question

ఈ సంచికలో >> శీర్షికలు >>

సత్యసాయి బాబావారు ప్రభోదించిన సూక్తులు - ఆదూరి హైమావతి

satya sai baba information

సాయి సమితులు

దేశ దేశాలలోని సాయిసేవా సమితుల వారి చిహ్నం ఐదు దళాల పద్మం. ఈ ఐదు దళాలు సత్యం, ధర్మం,శాంతి,ప్రేమ, అహింసలకు చిహ్నాలు- ప్రతీకలు. సత్యసాయి పబ్లికేషన్స్ ట్రస్ట్ వారు 'సనాతన సారధి' అనే మాస పత్రికతో బాటు 40 భాషలలో వెయ్యికి పైగా పుస్తకాలు ప్రచురించారు. వివిధ దేశాల్లో శాఖ లున్నాయి. 

2001లో "సాయి గ్లోబల్ హార్మొనీ ‘అనే రేడియో స్టేషను ప్రాంభమైంది. రేడియో సాయి - లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని వారంతా భజనలు, భక్తుల అనుభవాలూ, బాబావారి ఉపన్యాసాలు,ఇంకా భక్తిపరమైన నాటకాలూ, పండితులచే ఉపన్యాసాలూ వింటూ ఉన్నారు.

భక్తులందరికీ సత్యసాయి బాబావారు సర్వదేవతా తీత స్వరూపుడైన భగవంతుడే!.

భగవంతు డైనా సరే మానవాకారము ధరించిన పిమ్మట తాను సృష్టించిన ప్రకృతి ననుసరించి, సధారణ మానవులవలె, ధర్మబద్దమైన జీవనము గడుపుతారు.అలాంటి భగవదవతారమే శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం. మహావిష్ణువు తన అవతారాల్లో దుర్మార్గులైన రాక్షసులను సం హరించారు.కానీ సత్యసాయి బాబా వారు ఆవతారాల్లగా ఆయుధాలు ధరించకుండా దుర్మార్గులుగా వుండే మానవులను సన్మార్గుగా మార్చుటకు, ప్రేమ అనే దివ్యా యుధంతో మానవాళిని ఉద్దరించను వచ్చిన పరి పూర్ణ అవతారం.  

సత్యసాయి బాబావారు  ప్రభోదించిన సూక్తులు

 సర్వమత సమన్వయమే సాయి మతము
 సత్యమే నా ప్రచారము
ధర్మమే నా ఆచారము
శాంతియే నా స్వరూపము
 ప్రేమయే నస్వభావము. 

కృతఘ్నత క్రూర జంతువుల లక్షణం.-అంటూ మెత్తని ప్రేమ హృదయంతో జీవించమంటారు. నరుని సేవయే నారాయణుని సేవ. అనిచెప్తూ కాస్తంత త్యాగ గుణం అలవరచుకోమంటారు. నిరాడంబరమే మానవుని వెలలేని ఆభరణం.-అని తమ గొప్పచూపు కోడం కాక నిరాడంబరంగా జీవిస్తూ అషాయులకు కాస్త సహాయం అందించమంటారు.  

శీలము లేని మనిషి, చిల్లుల కుండ వంటివాడు-  పవిత్ర శీలాన్ని కలిగి ఉండ మంటారు. దివ్య జీవితాన్నికోరాలి కానీ దీర్ఘ జీవితాన్ని కాదు- దయగల హృదయమే దైవ మందిరం. జీవుడిని భాధించి, దేవుడిని పూజిస్తే లాభం లేదు.— మాట్లాడవలసిన తీరు గురించీ చెప్తూ - అతిభాష మతి హాని, మిత భాష అతిహాయి-అంటూ ఎల్లప్పుడూ తక్కువగా , ఇతరులను బాధించకుండా మాట్లాడమని ప్రభోధిస్తుంటారు. వెంట వచ్చేది సంస్కారమే గాని, సంసారము కాదు- అనే సూక్తి చెప్తూ త్యాగ గుణాన్ని పెంచుకో మంటారు. మోక్ష మంటే- మోహ క్షయమే  - కనుక వస్తు వ్యామోహం తగ్గించుకో మంటారు.- 

వ్యర్ధ వాదనలు వివేకాన్ని హరించి, అనవసర తగాదాలు తెస్తాయని -వాదన సాధనకు పనికి రాదు--అంటారు.

విద్యను ఆర్జించడం కేవలం  - ధనం కోసమే కాక నేర్చిన విద్యతో చక్కని గుణాలు కలిగి ఉండేలాగా జీవించ మంటారు.  విద్య గుణార్జనకు గాని ధనార్జనకు కాదు. ఆశయాల కోసం జీవించు - ఆశల కోసం కాదు -- వంటి ఇంకా అనేక నీతి వాక్యాలను తమ ఉపన్యసాల్లో సందర్భాన్ని బట్టి చేప్తుంతారు.-వీటిని వాక్య విబూదులు- అంటారు. తమ ఉపన్యాసాలలో చిన్నకధలనూ, పద్యాలనూ, నీతి వాక్యాలనూ పుంఖను పుంఖాలు గా చెప్పడం జరిగింది.  

సేవ గురించీ చెప్తూ , మాతృభూమి సేవ మరువ వద్దంటారు.'జననీ జన్మ భూమిశ్చస్వర్గాదపి గరీయసీ' అనే శ్రీరాముని మాటను పదేపదే గుర్తుచేస్తూ గ్రామసేవచేసి, వారి జీవితాలను సుఖ మయమయ్యేలాగా గ్రామస్తు లకు వసతులు కల్పించ మంటారు.- గ్రామసేవయే రామసేవ.-ఇలా వాక్య విబూదులతో శ్రోతలకు చక్కని నీతి నియమాల గురించీ బాబావారు తరచూతమ ఉపన్యాసాలలో  బోధిస్తుంటారు. భగవాన్ అందించిన అంతా ఆచరించవలసిన, అర్ధం చేసుకోవలసిన ముఖ్య ఆధ్యాత్మిక వాక్యాలు. 

“Life is a game, play it  - జీవితమొక ఆట, నీ ఆట నువ్వు ఆడు.
“Life is challenge, meet it- జీవితమొక సవాలు, ధ్యైర్యంగా ఎదుర్కో.
“Life is a dream, realise it- జీవితమొక స్వప్నమని గ్రహించు.
“Life is love, enjoy it- జీవితం ప్రేమమయం, ప్రేమయే జీవితంగా అనుభవించు, ఆనందించు.

అనే వాక్యాల ద్వారా జీవిత పరమార్ధాన్ని బాబావారు తమ ప్రసంగాల్లో తరచూ చెప్తుంటారు. 

మరిన్ని శీర్షికలు
weekly horoscope 3rd febuary to 9th febuary