Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Forest Daal

ఈ సంచికలో >> శీర్షికలు >>

సభకు నమస్కారం - ..

sabhakunamaskaaram

రామదుర్గం మధుసూదనరావుగారి కలం నుండి జాలువారిన కమానువీధి కథల సంపుటి  ఫిబ్రవరి 5 ఆదివారం నాడు హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరణ జరిగింది. సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్ కె.రామచంద్ర మూర్తి గారు సభాధ్యక్షత వహించారు. కుప్పిలి పద్మ, వాసిరెడ్డి  నవీన్, చీకోలు సుందరయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. చిన్ననాటి సంగతులను, స్నేహితులను మర్చి పోకుండా గుర్తుంచుకోవడమే కాకుండా, చదివించే చక్కటి కథలుగా, మర్చిపోలేని మంచి పాత్రలుగా తీర్చి దిద్ది పాఠకులకు అందించడం గొప్ప విషయమని  వక్తలు ప్రశంసించారు. వేదికపైనున్నవారే కాకుండా సభికుల్లోనుంచి కూడా కమాను వీధి కథలతో, అక్కడి నేపథ్యంతో సంబంధం ఉన్న పలువురు వేదికపైకి వచ్చి ప్రసంగించారు..ఈ కథా సంపుటికి చిత్రకారుడు మాధవ్ గీసిన చిత్రాలన్నిటినీ వేదికపైన అలంకరించడం సభకు ప్రత్యేకాకర్షణగా నిలిచింది...తిలకించిన ప్రతి ఒక్కరూ చిత్రకారుడిని కొనియాడారు...రచయిత రామదుర్గం మధుసూదన రావు కథల గురించీ, అందులోని పాత్రల గురించీ మాట్లాడారు. సభాధ్యక్షులను, వేదికనలంకరించిన పెద్దలను రచయిత రామదుర్గం మధుసూదన రావు దుశ్శాలువాలతో సత్కరించారు...

మరిన్ని శీర్షికలు
aachaaram