Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sabhakunamaskaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

కుజదోషం ఎవరికి వర్తిస్తుంది - నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు

aachaaram


శ్లో" ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం,
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం.


  

నిజానికి శాస్త్రప్రకారం అన్ని లగ్నాలకీ ఈ కుజదోషం వర్తించదు. ఇది ప్రతి సామాన్యుడు తెలిసికోవలసిన విషయం. లగ్నమనగా శరీరము. చంద్రుడనగా మనస్సుకు సంబంధంచిన వాడు. శుక్రుడు కళత్ర కారకుడు. అనగా భార్యకు సంబంధించిన విషయం. ఒక జాతకంలో లగ్నం నుంచి మరియు చంద్రుడు ఎక్కడ ఉన్నా అక్కడనుండి, అలాగే  శుక్రుడు ఎక్కడ ఉన్నా అక్కడనుండి ఈ మూడూ వేరువేరుగా చూడాలి. లెక్క చూడగా 1,2,4,7,8,12 రాశులలో కనుక కుజుడు ఉన్నచో ఆ జాతకంలో కుజ దోషం ఉన్నట్టు. ఇందులో కొన్ని సవరణలు ఉన్నాయి. అబ్బాయి జాతకంలోనూ, అమ్మాయి జాతకంలోనూ కుజదోషం ఉన్నప్పుడు అనగా ఒకరి జాతకంలో లగ్నం నుండి మరొకరి జాతకంలో శుక్రుడు నుండి కాని మరి ఏ ఇతర పైన చెప్పిన ప్రకారం ఉన్నా కుజ దోషం సమసిపోయినట్లే అనగా దోషం లేదు.


కుజ దోషం వర్తించని లగ్నాలు;- మేషం, కర్కాటక, సింహం, వృశ్చికం, ధనస్సు, మకరం, మీనం ఈ లగ్నాలకు కుజదోషం వర్తించదు. " ద్వితీయే భౌమదోషన్తు యుగ్న కన్యక యోర్వినా" అని చెప్పిన శ్లోకం దేవ కేరళ గ్రంధము నుండి పరిశీలిస్తే మిధున, కన్యా లగ్నములలో పుట్టిన వారికి రెండవ ఇంటిలో కుజుడు ఉంటే దోషం ఉండదు. అలాగే వృషభ, తులలో పుట్టిన వారికి పన్నెండవ ఇంట కుజుడు ఉంటే కుజదోషం ఉండదు. మేష, వృశ్చిక లగ్నాలలో పుట్టిన వారికి నాల్గవ ఇంట్లో కుజుడు ఉన్నదోషం ఉండదు. మకర, కుంభ లగ్నంలో పుట్తిన వారికి సప్తమంలో కుజుదు ఉన్న దోషం ఉండదు. ధనస్సు, మీన లగ్నంలో పుట్టిన వారికి అష్టమంలో కుజుడు ఉన్న దోషం ఉండదు. సింహ, కుంభ లగ్నములలో పుట్టిన వారికి కుజ దోషము ఉండదు అని దేవకేరళము అనే గ్రంధము అందు కలదు. 

మేష, వృశ్చికములు కుజుడునికి స్వక్షేత్రములు, మకరం ఉచ్చ రాశి కనుక ఈ లగ్నములలో పుట్టిన వారికి కుజదోషము ఉండదు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రములకు కుజుడు అధిపతి కనుక ఆ రాశులలో పుట్టిన వారికి కుజదోషం వర్తించదు. పుట్టిన సమయానికి కుజదశ వెళ్ళిపోయినా, వైవాహిక జీవితకాలంలో కుజ మహాదశ రాదు అనినా కుజదోషం పరిధి లోకి తీసుకోవసరం లేదు. చంద్ర మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. గురు మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. కుజుడు నీచలో ఉంటే కుజదోషం ప్రభావం అతితక్కువగా వర్తిస్తుంది. 
కుజ దోషము ఉంటే ఫలితాలు;-  కుజ దోషం పెళ్ళికాకుండా ఉంచడు కానీ కలహాలకు కారణం కుజుడు కావున వైవాహిక జీవితంలో గొడవలు బాగా జరుగుతాయి. కళత్ర కారకుడు శుక్రుడు, కలహకారకుడు కుజుడు పది డిగ్రీలలో కలిస్తే కుజదోషం ఉండదు కానీ అటువంటి జాతకులకు వైవాహిక జీవితంలో తరచూ అభిప్రాయ విభేదాలు వస్తుంటాయి. 

పరిహారం;-  ఒకవేళ వివాహమైన తరువాత ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరి జాతకంలో కుజదోషం లేకపోతే వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు నిత్యం బాగా చేస్తుంటే  కుజదోష ప్రభావం తట్టుకునే శక్తి వచ్చి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.

ముఖ్యవిషయం;- కుజదోషం అనగానే భయపడిపోవద్దు. దోషాలు ఎన్ని రకాలో వాటికి పరిష్కారాలు అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి ముందుగా సమస్యను నిశితంగా పరిశీలించి దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకుంటే సరిపోతుంది.

శుభం భూయాత్..

మరిన్ని శీర్షికలు
weekly horoscope 23rd june to 29th june