Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

తాప్సీ వస్తానంటే మనమొద్దంటామా.. ?

tapsi entered  bollywood

తెలుగు తెరపై బబ్లీ గాళ్‌గా గ్లామర్‌ ఒలకబోసిన ముద్దుగుమ్మ తాప్సీ. ఇప్పుడు టాలీవుడ్‌కి బైబై చెప్పేసి, బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. ప్రాధాన్యత ఉన్న పాత్రలను దక్కించుకుంటూ తనలోని టాలెంట్‌ని బయటికి తీసుకొచ్చింది తాప్సీ. ఇంతవరకూ తాప్సీ అంటే కేవలం గ్లామర్‌ డాళే అని తెలుసు. కానీ తాప్సీ ఎలాంటి పాత్రైనా మెప్పించగలదు అని ప్రూవ్‌ చేసుకుంది. తెలుగులో చాలా చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో జస్ట్‌ అందమైన హీరోయిన్‌ అనిపించుకుంది అంతే. ఇప్పుడు తెలిసింది కదా తాప్సీ అంటే ఏంటో. అందుకే మన టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు ఇప్పుడు తాప్సీ వంక చూస్తున్నారట.

ఆమెతో టాలీవుడ్‌లో కూడా ఓ మాంచి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ స్టోరీని తెరకెక్కించే యోచనలో ఉన్నారట. అందుకు తాప్సీ కూడా సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఇంత స్టార్‌డమ్‌ సంపాదించినా కానీ తనకు టాలీవుడ్‌పై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదంటోంది. మంచి అవకాశం వస్తే తెలుగులో నటించడానికి సిద్ధమే అంటోంది. అన్నట్లు తాప్సీ నటించిన 'నామ్‌ షబానా' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమాను తాప్సీ తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటోందట. 'నేనే షబానా' పేరుతో ఈ సినిమా తెలుగులో విడుదల కానుందట. గ్లామరస్‌ తాప్సీ, ఇప్పుడు బాలీవుడ్‌ యాక్షన్‌ గాళ్‌ కూడా. అలాంటి తాప్సీ ఇప్పుడు తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తే ఆమె కోసం మన వాళ్లు ఎలాంటి స్టోరీలు ప్రిపేర్‌ చేస్తారో మరి చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
charan act in sukumar direction