Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

ఎగ్జామ్స్‌ మేనియా - ప్రిపేరవ్వండిలా

how to prepare for exams

ఫిబ్రవరి వచ్చేసింది, దాటేస్తోంది. ఇప్పుడంతా పరీక్షల మూడ్‌. చిన్న పిల్లల దగ్గర్నుంచి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యూత్‌ దాకా ఎవర్ని కదిలించినా, పరీక్షల టెన్షన్‌తోనే కనిపిస్తారు. చిన్న పిల్లలకైనా, యువతకైనా ఈ పరీక్షలు 'జీవిత పరీక్ష'ను తలపించేలా ఉంటున్నాయి. ఆ ఒత్తిడిలోనే లేనిపోని అనారోగ్యాల్ని కొనితెచ్చుకుంటున్నారు. ప్రధానంగా యువత పరీక్షల టెన్షన్‌తో మంచాన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముందుగా కుటుంబ సభ్యులే, తమ పిల్లలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు వారికి మానసికోల్లాసాన్ని కల్గించడం, ఒత్తిడి నుంచి దూరం చేసేందుకుగాను వారితో తరచూ సంభాషిస్తుండడం, అవసరమైన సలహాలిస్తుండడం చేయాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలంటే తమ జీవితానికి తాము వేసుకోబోయే తొలి మెట్లు లాంటివని యువత భావించడం సహజమే. ఫీజు కట్టామా? పరీక్ష రాశామా? అనుకోవడంలేదిప్పుడు యువత. ఖచ్చితంగా ర్యాంక్‌ కొట్టి తీరాల్సిందే.

అలా ర్యాంక్‌ కొట్టాలంటే పది గంటలు, 18 గంటలు కాదు, 24 గంటలు కూడా సరిపోవడంలేదు. కొందరు ర్యాంకర్లు అదే పనిగా చదివేసి, సాధించేస్తుంటారు. ఇంకొందరు తక్కువ చదివి, మంచి ర్యాంకుల్ని సొంతం చేసుకుంటారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్‌. అసలు చదవుకుండా పోటీ పరీక్షల్లో నెగ్గుకురావడం కష్టమన్నది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అలాగే, ఎంత చదివినా ఆ చదివింది బుర్రకెక్కించుకోకపోతే వేస్ట్‌ అని కూడా తెలుసుకోవడం ముఖ్యం. 

ఇంట్లో ప్రశాంత వాతావరణం, ఆరోగ్యకరమైన జీవనం ఇవన్నీ అందరికీ అవసరం. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థులకూ ఇవి అత్యవసరం. టైమ్‌ టు టైమ్‌ స్టడీ షెడ్యూల్‌ని ప్రిపేర్‌ చేసుకుని, కాస్తంత ఖాళీ సమయం చూసుకోవడం, ఆ సమయంలో మానసికోల్లాసం కోసం క్రీడలు, లేదంటే కుటుంబ సభ్యులతో టైమ్‌ పాస్‌ చేయడం చాలా ముఖ్యం. కాస్సేపు రిలాక్స్‌ అయితే చాలు, తమ పిల్లల్ని 'చదువుకోవచ్చు కదా' అని క్లాస్‌ తీసుకునే తల్లిదండ్రుల్ని చూస్తుంటాం. పరీక్షల సమయంలో వారిని మోటివేట్‌ చేసేలా మాట్లాడాలి తప్ప, విసిగించేలా ప్రవర్తించకూడదు. 'విసుగు' వచ్చిందంటే, ఏ విద్యార్థికి అయినా ఏకాగ్రత తప్పుతుంది. ఈ విషయంలో కుటుంబ సభ్యుల పాత్ర చాలా ఎక్కువ. అలాగే ఫ్రెండ్స్‌తో ఇంటరాక్షన్‌ పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడ్తుంది. వీలు చిక్కినప్పుడల్లా స్నేహితులతో కలిసి స్టడీ అవర్స్‌ని ప్లాన్‌ చేసుకోవడం మంచిది. టైమ్‌ టు టైమ్‌ స్టడీ అవర్స్‌ ఎలా ప్లాన్‌ చేసుకుంటారో, సరైన సమయానికి ఆహారం తీసుకోవాలన్న విషయాన్ని కూడా పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు తెలుసుకోవాలి. ర్యాంక్‌ రాదేమో అన్న భయం కన్నా, ర్యాంక్‌ కొట్టాలన్న పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో పుస్తకాలు తిరగేస్తే, సబ్జెక్ట్‌ చాలా తేలిగ్గా మెదళ్ళలోకి చేరుతుంది. చదివేశాం, అని బుక్‌ మూసేయకుండా - మళ్ళీ మళ్ళీ దాన్ని తిరగేయడం, వీలైతే అందుబాటులో ఉండే కొత్త మెటీరియల్‌ వైపు దృష్టి సారించడం ఇవన్నీ ర్యాంకుల పంట పండించడానికి ఉపయోగపడ్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఏకాగ్రతతో పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వండి బావి భారత పౌరుల్లారా!

మరిన్ని యువతరం
technology importance