Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కొత్త సీరియల్ ప్రారంభం

naadaina prapancham

ప్రతి మనిషి జీవితం లోన మలుపు అన దగ్గ సంఘటనలు ఏవో జరుగుతూనే వుంటాయి.


ఆ సంఘటన దగ్గర మనం ఎంత విజ్ఞతతో ప్రవర్తిస్తామన్న దాని మీదే మనం  సాధించే జయాప జయాలు ఆదార పడి వుంటాయి.

ఆ మలుపు దగ్గర తారస పడే వ్యక్తులు, జీవితాంతం మిత్రులుగా మారొచ్చు... శత్రువులుగా మారొచ్చు. ఆ మలుపే మనల్నిఉన్నత శిఖరాల మీద నిల బెట్టొచ్చు, అధ: పాతాళానికి తొక్కెయ్య వచ్చు.

జీవితం ఒక గేమ్‌...

ఎదుటి వాడికి ఛాన్సివ్వడం మానవత్వం అనుకుంటే ఓటమిని నువ్వు ఆహ్వానించు.

కానీ ఓడి గెలుస్తాను.

జీవితం ఒక గేమ్‌.

ఎదుటి వాడిని తొక్కయినా గెలవాలీ అని అనుకుంటే గెలుపు నీ దగ్గరకి రావచ్చు.

కానీ గెలిచీ ఓడుతావు.

గెలుపోటముల మధ్య వున్న అతి సూక్ష్మమైన బంధాన్ని అర్ధం చేసుకో గలిగితే.....

నువ్వు గెలవడం కోసం ఆడవు.

ఓడితే కుంగి పోవు.

ఆడటం లోని ఆనందాన్ని అనుభవిస్తావు.

జీవించడంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తావు.

ఇదే క్రీడా స్ఫూర్తి.

ఇదే జీవితానికి స్ఫూర్తి.....

*********

హైదరాబాద్‌....

ఎల్బీ స్టేడియం.

సాయంత్రం నాలుగు గంటలు.

స్టేట్‌ లెవల్‌ వాలీ బాల్‌ క్రీడలు జరుగుతున్నాయి. అండర్స్‌`16 బాలికల వాలీ బాల్‌ గేమ్‌ ఫైనల్‌ ఆ రోజు. లీగ్‌ మ్యాచ్‌లన్నింటిలో అరి వీర భయంకరంగా ప్రత్యర్ధులను మట్టి కరిపించి హైద్రాబాద్‌ బాలికల జట్టు, కృష్ణా జిల్లా బాలికల జట్టు ఫైనల్‌ చేరుకున్నాయి.
క్రీడలంటే  ఆసక్తి వున్న ప్రేక్షకులు ఐదు వేల మంది వరకు వచ్చారు. ఆ ఫైనల్‌కు ఆ ప్రేక్షకుల సంఖ్య తక్కువేమీ కాదు.

అందరూ లోకల్‌ పీపుల్‌ కాబట్టి సహజం గానే హైదరాబాద్‌ జట్టుకి సపోర్టు ఎక్కువగా వుంది.

మ్యాచ్‌ ప్రారంభమైంది. ఇరు జట్ల బలాబలాలు సమానంగా వుండటంతో ఆట పోటా పోటీగా సాగుతోంది. ప్రేక్షకులలో వున్న యువకులంతా విజిల్స్‌, కేకలతో గోల చేస్తున్నారు.

కాని వాళ్ళ మధ్యే వున్న ఇరవై రెండేళ్ళ యువకుడు ఆటని తదేకంగా గమనిస్తున్నాడు. ఆటలో పూర్తిగా లీనమవడంతో ఏ బాల్‌ని కొట్టాలో ప్లేయర్స్‌ కన్నా ముందు అతని మైండ్‌ డిసైడ్‌ చేస్తోంది.

వాళ్ళు శరీరాలతో ఆడుతున్నారు.

అతను మెదడుతో ఆడుతున్నాడు.

ఆడుతున్న వాళ్ళలో హైదరాబాద్‌ జట్టులోవున్న ఒక పొడవాటి అమ్మాయి ఆట అతన్ని ఆకర్షించింది. పదిహేనేళ్ళకే ఐదడుగుల ఆరంగుళాల పొడవుతో, పొందికైన శరీరంతో...

క్రీడా కారిణి అన్న పదానికి నిర్వచనంలా వుంది.

కృష్ణా జిల్లా జట్టులో బాలికలందరూ ప్రతిభావంతంగా ఆడుతున్నారు. కాని హైదరాబాద్‌ జట్టులో ఇద్దరమ్మాయిలు వీక్‌గా వున్నారు.
మిగతా వాళ్ళు వాళ్ళని కవర్‌ చేయడానికి కష్ట పడాల్సి వస్తోంది.

కోర్టులో ఉషారుగా కదులుతున్న ఆ అమ్మాయి వంకే తదేకంగా చూస్తున్నాడు ఆ యువకుడు. స్కోరు 8.8 సమానంగా సాగుతోంది.
అందరిలో టెన్షన్‌ పెరుగుతోంది.

కృష్ణా జిల్లా జట్టుకి సపోర్టు తక్కువగా వున్నా, టీమ్‌ స్పిరిట్‌తో వాళ్ళను వాళ్ళే ఉషారు పరచుకుంటూ ఆడుతున్నారు. స్వంత ప్రదేశంలో ఆడుతున్నామన్న ధీమా హైదరాబాద్‌ వాళ్ళది. వాళ్ళలో వున్న ఆత్మ విశ్వాసం మూలంగా టీమ్‌లో వున్న వీక్‌ పాయింట్స్‌ని కవర్‌ చేసుకుంటున్నారు.

కృష్ణా జట్టు కెప్టెన్‌ సర్వీస్‌కి రాగానే హైదరాబాద్‌ టీమ్‌కి దడ పట్టుకుంది.

ఝంఝా మారుతంలా దూసుకు వచ్చే ఆ సర్వీస్‌ ని ఎదుర్కోవడమే కష్టం. ఇక బ్రేక్‌ చేయడమంటే మాటలా?

ఫస్ట్‌ బాల్‌ రైట్‌ సైడ్‌ డిఫెన్స్‌ వైపు దూసుకెళ్ళింది.

కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లయ్యి, గుడ్డిగా గాలి లోకి చేతులు ఊపింది అక్కడ వున్న అమ్మాయి. సైడ్‌ లైన్‌కి రెండంగుళాల యివతల నేలను తాకి బయటకు వెళ్ళి పోయింది బంతి.

స్కోరు....9`8.

ఆ యువకుడు తననాకర్షించిన ఆ అమ్మాయి మూవ్‌మెంట్స్‌ పరిశీలిస్తున్నాడు.  సెంటర్‌ ప్లేస్‌లో నిబడింది ఆ అమ్మాయి. ఈ సారి బంతి తనకే గురి చేయ బడుతుంది అన్న విషయానికి ఆమె మానసికంగా సంసిద్దమయింది.

అతనికి ముచ్చటేసింది.

ఆటలో అదే ముఖ్యం. ప్రత్యర్ధి సైకాలజీని గమనించి అందుకు మనం సెకండ్స్‌లో ప్రిపేరవడం చాలా ముఖ్యం. అనుకున్నట్లుగానే ప్రత్యర్ధి జట్టు కెప్టెన్‌ చేసిన సర్వీస్‌ సెంటర్‌కి బూస్టర్‌కీ మధ్యలో నేలని ముద్దాడ బోతోంది. బూస్టర్‌ చూస్తూ నిల్చుంది. సెంటర్‌ ప్లేస్‌లో వున్న అమ్మాయి.... ఆఖరి క్షణంలో రియాక్ట్‌ అయింది. పూర్తిగా నేలకి వాలి పోయి కుడి చేతిని ముందుకు చాపి, బంతికీ, నేలకీ అడ్డుగా పెట్టింది. ఆ క్షణంలో చెయ్యి నేలకి తాకకుండా జాగ్రత్త పడింది.

అంతే...బాల్‌ పైకి లేవడం, బూస్టర్‌ దాన్ని పొజిషన్‌ లోకి తేవడం లెఫ్ట్‌ సైడ్‌ స్ట్రయికర్‌ దాన్ని స్మాష్‌ కొట్టడం వూహించని వేగంతో జరిగి పోయాయి.

సర్వీస్‌ బ్రేక్‌ అయింది.

కృష్ణా జట్టు కెప్టెన్‌ నమ్మ లేక పోయింది.

సెంటర్‌ ప్లేస్‌ వంక తీక్షణంగా చూసింది.

ప్రేక్షకులంతా గొల్లున అరుపులు, ఈలలు....

హైదరాబాద్‌ జట్టు సర్వీస్‌లో రెండు పాయింట్స్‌ వరసగా సాధించి....

10.9 ఆధిక్యం లోకి దూసుకెళ్ళింది. తర్వాత వాళ్ళ సర్వీస్‌ కూడా బ్రేకయింది.

అందరి లోనూ తీవ్రమయిన ఉత్కంఠ నెలకొంది.

అందరి లోనూ తీవ్రమయిన ఉత్కంఠ నెలకొంది.

ఈ మధ్యకాలంలో ఇంత టెన్షన్‌ గేమ్‌ చూడలేదని వాలీ బాల్‌ క్రీడా కారులంతా అనుకుంటున్నారు.

అప్పుడు వరుసగా రెండు పాయింట్లు సాధించిన వాళ్ళని విజయం వరిస్తుంది.

ఆ పాయింట్‌ కృష్ణా వాళ్ళు సాధిస్తే వాళ్ళదే గేమ్‌.

హైదరాబాద్‌ వాళ్ళు సాధిస్తే మళ్ళీ 14 14 అవుతుంది.

గేమ్‌ పాయింట్‌ దగ్గర సర్వీస్‌ కృష్ణా జిల్లాకి వచ్చింది.

అదీ కెప్టెన్‌ సర్వీస్‌.

అడేవాళ్ళు కూడా టెన్షన్‌గా వున్నారనడానికి చిహ్నంగా ఆ బాల్‌ని సర్వీస్‌ చేసే ముందు రెండు నిమిషాలు ఇరు జట్లూ టైమ్‌ ఔట్‌ కోరి, గ్రౌండ్‌ బయట డిస్కస్‌ చేసుకున్నారు.

ఆ యువకుడి ధ్యాస అంతా ఆ అమ్మాయి మీదే. అందరూ ఎవరి ప్లేస్‌లో వాళ్ళు న్చిున్నారు. ఆ అమ్మాయి లెఫ్ట్‌ సైడ్‌ స్పైకర్‌గా నిల్చుంది.
కృష్ణా కెప్టెన్‌ సర్వీస్‌ చేసింది. ఎప్పటి మాదిరిగా ఆ సర్వీస్‌ తుపాకి గుండులా దూసుకుంటూ సెంటర్‌కి వచ్చింది.

అయితే అది డైరెక్ట్‌గా చేతుల మీదకి రావడంతో ఆ అమ్మాయి దాన్ని బూస్టర్‌ వైపు పాస్‌ చేసింది.

ఇంకా తర్వాత కృష్ణా జట్టు ఆశలు వదిలేసుకుంది. గేమ్‌ మళ్ళీ ప్రొలాంగ్‌ చెయ్య బడుతుంది అనుకున్నారు.

బూస్టర్‌ దాని లెఫ్ట్‌ సైడ్‌ స్పైకర్‌కి స్మాష్‌ కోసం పాస్‌ చేసింది... స్మాష్‌ కోసం చక్కటి పొజిషన్‌లో బాల్‌ పైకి లేచింది.

శరీరాన్ని తేలిక చేసుకుని బంతిలా రివ్వున పైకెగిరి ఉక్కు ముక్కలా దృఢంగా ఉండే చేతితో స్మాష్‌ కొట్టాల్సిన బంతి అది...
అదే జరిగిందనుకొన్నారందరూ....

ఆ అమ్మాయీ తను కావలసినంతా పైకెగిరాననే అనుకుంది.

కానీ అనుకున్నంత ఎత్తుకి ఎగర లేక పోయింది. చెయ్యి మెల్లగా తాకింది. దాంతో వేగం తగ్గింది. బంతి మెల్లగా నెట్‌కి ఆరంగుళాల ఎత్తులో రెండు కోర్టులకి మధ్యన గాల్లోకి ఎగిరింది.

కృష్ణా జిల్లా బూస్టర్స్‌ చేతికి తగిలి బంతి నెట్‌ మీదుగా జారుతూ హైదరాబాద్‌ జట్టు కోర్టులో నేలకొరిగింది. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu aame oka rahasyam