Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri question

ఈ సంచికలో >> శీర్షికలు >>

సత్యసాయి బాబా - ఆదూరి హైమావతి

satya sai baba information

సత్యసాయి సేవాసంస్థల ద్వారా సత్యసాయి భక్తులు దేశ,విదేశాల్లో సైతం అవసరమైనవరికి సేవలను అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి దేశాధ్యక్షుల వరకు బాబావారి పేరు విననివారే లేరు. బాబా ఆశీర్వాదం అందుకోని వారే లేరు. బాబావారిది ఎల్లలు లేని ప్రేమ.నిష్కల్మష, స్వార్ధ రహితప్రేమ! దానికి సాటిమరెక్కడా మరొకటి లేనేలేదు. హద్దులు లేని ఆప్యాయత. భక్తులను చూస్తే బాబాకు అంతులేని ఆనందం.అందుకే బాబావారికి దేశంలోనే కాక ఖండ ఖండాంతరాల్లో భక్తులు ఉన్నారు.దేశాధ్యక్షులు, గవర్నర్లు, ప్రధానులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు,  సినీనటులు,సినీరంగ ప్రముఖులు, క్రీడాకారులు, గొప్పవ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇలా- ఎందరో  ఎందరెందరో అందరూ బాబావారి  దర్శనం కోసం, ఆశీస్సుల కోసం ఎదురుచూసి అందుకున్న వారే.  భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టపర్తిని సందర్శించి, బాబావారిపకక్నే కూర్చుని ఆనందించారు.అక్కడి పధ్ధతులకూ, క్రమశిక్షణకూ ఎంతో ఆనందించారు.  భారతీయ ఆధ్యాత్మిక గురువుగా ఖ్యాతి గాంచిన భగవాన్ శ్రీసత్యసాయి బాబా అంటే కలాంకు ప్రత్యేక గౌరవ మూ, భక్తీనీ. కలాం  రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పుడు బాబావారి  81వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొ న్నారు. శాస్త్రవేత్త, పైగా రాష్ట్రపతి హోదాలో ఉన్న అబ్దుల్ కలాం నిరాడంబరతను బాబావారు సైతం ప్రస్తుతించారు.  

నా జీవితమే నా సందేశం.'  అన్నారు భగవాన్ సత్యసాయిబాబావారు.బాబావారు దర్శనసమయంలో భక్తులకేసి చూస్తేనే వారి మనస్సులు ఆనందపరవశాలవుతుంటాయి.బాబాగారి చూపుల్లో ఉన్నమహిమ అలాంటిది. 

నీకంటి చూపులో ఏశక్తి ఉన్నదో                                                                                                               .           ఆనంద భాష్పాలు జాలువారు
నీమంద హాసాన ఏమహిమ ఉన్నదో
పాషాణ హృదయమ్ము పరవశించు  
నీ హస్త స్పర్శలో ఏ చలువ ఉనందో
తనువు పులకరించి ధన్య మగును
నీపాద యుగళిలో ఏబోధ ఉన్నదో
ఆత్మ తత్వము మాకు అర్ధ మగును
కళ్ళుకావవి ప్రేమ వాకిళ్ళు స్వామి 
స్పర్శ కాదు దేవుని పరామర్శ స్వామి
పాదములు కావవి నాల్గు వేదములు స్వామి.--
అంటూ ఒక భక్తుడు మనసారా బాబావారికి ఇలా పద్య రూపంలో తన భక్తిని చాటుకున్నాడు.

భగవాన్ సత్యసాయి బాబావారు ఎరుక పరచిక సత్య వాక్యాలు.

1. I am God, you are also God, My powers are patent, your powers are latent...నేను దేవుడిని. నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సంగతి నాకు తెలుసు. నీకు తెలియదు.

2.మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను. విశ్వవ్యాప్తమైన, ఏకమైన ఆధ్యాత్మిక సూత్రం - ప్రేమ అనే మార్గం, ధర్మం, బాధ్యత - ఈ ఆత్మ సత్యాన్ని చెప్ప డానికే వచ్చాను. 

3.ప్రపంచ మానవాళిని సౌభ్రాతృత్వ భావంతో ఏకం చేయడానికి, ఆత్మ సత్యాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ సాయి వచ్చాడు. మనిషినీ మనిషినీ జోడించే ఈ దివ్య సంప్రదాయమే విశ్వాధారమైన సత్యం. ఇది తెలుసు కొంటే మనిషి పశుత్వం నుండి ఎదిగి దివ్యత్వం సాధించగలడు .

4.మీ అందరిలో సాత్విక భావాన్ని పెంపొందించడమే నా లక్ష్యం. సత్వ గుణమే ముఖ్యం.

5.మీకు నేను ఆరోగ్యైశ్వర్యాలను ప్రసాదించేది మీ అవరోధాలను తొలగించి ఆధ్యాత్మ సాధనపై మనసు లగ్నం చేయాలన్న ఉద్దేశ్యంతోనే.

6.అన్ని మతాలూ వికసించాలి. భగవంతుని వైభవం అన్ని భాషలలోనూ గానం చేయబడాలి. అదే ఆదర్శ వం తమైనది. వివిధ మతాల మధ్య భేదాలను గౌరవించండి. అన్నిమతాల సారం ఒక్కటే  . ఐక్యత అనే జ్యోతిని పోషించండి.

భగవత్ న్యాయమైన పంచభూతాల నుంచీ గ్రహించి పొందిన పాంచభౌతిక  శరీరాన్ని తిరిగి ప్రతి ప్రాణీ పంచ భూతా ల్లో కలిపేయాలనే  ధర్మం ప్రకారం అన్ని అవతారాలూ తాము ఏ లక్ష్య సిధ్ధి కోసం  అవతరించారో ఆ లక్ష్యం పూర్తయ్యాక ,శరీరాన్ని త్యజించిన విధంగానే సత్యసాయి బాబా వారూ దేహాన్నీ త్యజించారు. ఐతే వారు తలపెట్టి, ప్రారంభించిన కార్యక్రమాలనీ యధాతధంగా కొన సాగుతూనే ఉన్నాయి . విద్య, వైద్య ,ఆధ్యాత్మిక కార్య క్రమాలు నిరంతరాయంగా సాగేందుకు భగవాన్ బాబావారు ఆశీస్సులు ,సూచ నలు ఆయన భక్తాళి కంతా అందజేస్తూనే ఉన్నారు.

దేహము పాంచభౌతికము దేహము కూలక తప్ప దెప్పుడున్
దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావు పుట్టుకల్
మోహ నిబంధ బంధనల ముద్రలు  లేవు నిజంబు జూడ నా
దేహియె దేవదేవుడు మదిన్ దలపోయగ నాత్మ రూపుడౌ.

అంటూ బాబావారు దేహం ఉన్నంత వరకే సత్కార్యాచర చేయాలని  సూచిస్తూ తాము బాల్య దశనుంచే, అంటే తాము భగవంతుడని  అవతార ప్రకటన చేయక  ముందు నుంచే  మానవ సేవ ఎలా చేయాలో, పేద సాదల కు , అసహాయులకూ తమకున్న దాంట్లో ఎలా దాన ధర్మాలు చేయాలో తాము ఆచరిస్తూ లోకానికి చూపారు.

అర్త జనులు బాధపడుతుంటే  ఆయన చూడలేరు.   

సత్యసాయి బాబావారు అవతార ప్రకటన చేయకముందు నుంచే తాము భగవంతుడు అనితెలియపరచక  ముందే అనుసరించిన విషయాలు కొంత ఆసక్తిగానూ, చిత్రంగానూ ఉండేవి. ఉదాహరణకు ఒక సంఘటన.

అది సుమారుగా 1930 ప్రారంభం లో జరిగిన సంఘటన .  సత్యనారాయన రాజు అనే బాలుని ఇంటి ముందు ఒక రోజున అపరాహ్నసమయాన ,ఒక భిక్షగాడు ఆకలితో "అన్నం బాబయ్యా!  " అని అడుగుతూ నిల్చి ఉన్నాడు. అది అంతా భోజనాలు చేసే సమయం.

ఆ బాలుని అంతా ' రాజూ! ' అని పిలుస్తుంటారు.ఆ అన్నార్తుని పిలుపు ఐదా రేళ్ళ  రాజు విన్నాడు. వేసవి ఎండలో ఆకలికి ఉండలేక అతడు  అరచిన అరుపు రాజు గుండె కరిగించింది. రాజు ఇంట్లో సభ్యులు చాలా మందే ఉన్నారు. వారిది కాస్త పేద కుటుంబమే! వారింట రాగి సంకటి  మధ్యాహ్నం అంతా భుజిస్తారు. అతడి తల్లి చల్లగా పోతే బాగుండదు కనుక రాగి సంకటి భోజన సమయానికి తయారు చేసి తెచ్చి అందరూ భోజ నాలకి కూర్చోగానే  తెచ్చి ఒక్కోరి భోజన పళ్ళెం  లో ఒక్కోముద్దా వడ్డించింది .ఆ సమయంలో  ఆకలి కేక విన్న  రాజు వెంటనే ఇంట్లోకి వెళ్ళాడు.అంతా భుజించను  కూర్చుని ఉండగా తన భోజన పళ్ళెం  లో తల్లి వడ్డించి ఉంచిన భోజనాన్ని తెచ్చి  ఆ భిక్షగాని పాత్రలో ఉంచాడు. అతడు ఆనందంగా రాజును దీవించాడు. రాజు ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో పెద్దలు  " సత్యం !  ఏంటీ పని ? నీవే ఇంటికి పెద్దవా ?  మన మేం ధన వంతు లమా ! మనకున్నది మనకే సరిపోదు , దాన్లో నీవు పెద్ద వారి ని అడగ కుండానే భోజనాన్ని ఇతరు లకు తీసుకెళ్ళి  పెడతావా? నీకీ పూట భోజనంలేదు .." అని కోప్పడ్డారు. ఇంట్లోవారు అతడ్ని ' సత్యం' అంటారు.

సత్యం చిరునవ్వుతో " అలాగే ఈ పూట నేను భోజనం చేయను."అని చెప్పాడు ,ఆభిక్షకుడు ఆనందంతో ఆ అన్నం తింటూ తృప్తిగా  వెళ్ళడాన్ని చూస్తూ నిల్చుని ఉన్నాడు సత్యనారాయ ణ రాజు.. కొంత సేపయ్యాక అందరూ భోజనం చేయడం ప్రారంభించారు.  " సత్యం! భోజనానికి రా " అని తల్లి పిలువగా, " ఈ పూట నేను భోంచేయను. ఆ భిక్షకుని ఆకలి తీరగానే నా ఆకలి తీరింది. నాకు ఆకలి లేదు ." అని చెప్పి ,ఎవరెంత బ్రతి మాలినా ఆరోజు సత్యనారాయణ రాజు మాత్రం అన్నం తిననే  లేదు. ఐదారేళ్ల బాలునికి ఈ విచిత్ర నైజమేంటీ ! అంటే దాని అంతరా ర్ధం అతడు దైవం, ఇంకా ప్రకటన కాలేదంతే!

శ్రీకృష్ణమూర్తి తన ఇంట్లో వెన్న జున్నే కాక , భక్తు లందరి ఇళ్ళలోని పాలు,పెరుగు వెన్న, జున్నూ తన స్నేహి తు లందరికీ పంచినట్లుగానే బాల బాబా తన  భోజనాన్ని ఆ ఆకలి గొన్న వానికి ఇచ్చి సంతృప్తి చెందాడు. ఆకలైన వారికి పెట్టకుండా తినడం పాపం .మనకున్న దాన్లోనే కొంత పెట్టాలనే  దాన్ని  రాజు ఆచరించి చూపా డు.  

మరిన్ని శీర్షికలు
chamatkaaram