Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

వృధా చేస్తే శాపమా..! - సిరాశ్రీ

sirasri question

 

1. ఆహారాన్ని వృధా చేయకూడదు. ఖచ్చితంగా పేదలకి దానం చెయ్యాలి. అన్నాన్ని వృధా చేస్తే భగవంతుడు శపిస్తాడు. 

 

2. ఈ లోకంలో వృధా అయ్యే ఆహారం అనేది ఏదీ ఉండదు. మనుషులు కాకపోతే జంతువులు, క్రిములు, కీటకాలు తింటాయి. ఆ జీవులు కూడా దేవుడి సృష్టే. కనుక ఎవరికీ ఏ శాపాలు పెట్టడు. 

 

పై రెండిట్లో ఏది కరెక్ట్? 
 

ఇది బేతాళ ప్రశ్న కాదు. బేతాళ ప్రశ్నల గురించి విక్రమార్కుడి కథల్లో విన్నాం. బేతాళుడు అడిగే ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పకపోతే తల వేయి చెక్కలవుతుందట. ఇక్కడ అడిగే ప్రశ్నలకి సమాధానం ఏది సరైనదో అడిగే  బేతాళుడికే తెలియదు. కనుక ఎవరి తలా చెక్కలవ్వదు. కనుక సరదాగా ఆలోచించి తోచిన సమాధానం చెప్పొచ్చు. ఇది కేవలం ఆలోచనా పరిధిని పెంచే సరదా ఆట అనుకోండి అంతే ! మీ సమాధానాల్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి. నలుగురి ఆలోచనల రాపిడి లోంచే జ్ఞానం పుడుతుంది....

మరిన్ని శీర్షికలు
satya sai baba information