Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
achaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

కథాసమీక్ష - ..

కథ : అసూయ
రచన  : ప్రతాప వెంకట సుబ్బారాయుడు
సమీక్షకులు  : రాచమళ్ళ ఉపేందర్ 

గోతెలుగు  63వ సంచిక!

మంచి ఊహ, దానికి తోడు జీవితానుభవం, తీసుకున్న వస్తువు పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న రచయితల కలం నుండి జాలువారిన  కథలు కమ్మని సువాసనలను వెదజల్లుతాయి. పాఠకులను పారవశ్యంలో ముంచెత్తుతాయి. కథలో చదివిన పాత్రలు గుర్తొచ్చినప్పుడల్లా మనసులో గిలిగింతలు  కలుగుతాయి. ఇలాంటి కథలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ కోవకు చెందినదే గో తెలుగు వార పత్రికలో ప్రచురితమైన "అసూయ" కథ. ఈ కథకు గీసిన చిత్రం బహు చక్కగా ఉందనటం అతిశయోక్తి కాదు.


మేనరికం అనే మంచి వస్తువుని తీసుకొని, చక్కటి కథనంతో... సరదా సన్నివేశాలు, సంభాషణలతో కథ సాగిన తీరు అద్భుతం. మేనరికం వివాహాం చేసుకోవడం వల్ల పిల్లలు సరిగా పుట్టరనే కారణంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మరదలును కాదని, వైష్ణవిని పెళ్ళి చేసుకుంటాడు కథా నాయకుడు. పెళ్ళై సంవత్సరం గడిచిన తర్వాత ఇంటికి వచ్చిన మరదలు తమ మధ్య ఉన్న ప్రేమానుబంధాల్ని వైష్ణవి ముందు ప్రస్తావించడంతో, అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది వైష్ణవి. అక్కడి నుండి  భార్య లేని భర్తకు ఎన్ని కష్టాలో రచయుత వర్ణించిన తీరు కడుపుబ్బా నవ్విస్తోంది.

చివరకూ  తనకూ మరదలుపై ఎటువంటి అభిప్రాయం లేదని, పెళ్ళితోనే మరదలును నా మనసు నుండి వెళ్ళిపోయింది భార్యను కాకపట్టండంతో కథ సుఖాంతం అవుతుంది.

హద్దులు దాటని శృంగారాన్ని, మనసుకు హత్తుకునేలా పి.వి. సుబ్బారాయుడు గారు రాసిన ఈ కథ మంచి అనుభూతిని  పంచే అత్యుత్తమ కథ అనటంలో సందేహం లేదు.

 

 

 

 

ఈ క్రింద లింకులో ఈ కథ చదివెయ్యండి మరి...http://www.gotelugu.com/issue63/1727/telugu-stories/jelocy/

మరిన్ని శీర్షికలు
Leg Piece Biryani | Village Style | Very Easy and Tasty