Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chiru and balakrishna records hit

ఈ సంచికలో >> సినిమా >>

రామ్‌ వచ్చేస్తున్నాడొచ్చేస్తున్నాడోచ్‌

ram is comming

'హైపర్‌' తర్వాత కొంచెం గ్యాప్‌ తీసుకున్న రామ్‌. లేట్‌ అయినా లేటెస్ట్‌గా వచ్చేందుకే ఈ చిన్న గ్యాప్‌ తీసుకున్నాడట. ఈలోగా పలు గెటప్‌లు ట్రై చేశాడు యంగ్‌ హీరో రామ్‌. పూర్తి గడ్డంతో ఓ డిఫరెంట్‌ లుక్‌తో సోషల్‌ మీడియాలో ఫొటోలు పోస్ట్‌ చేశాడు మొన్న. మళ్లీ కొంచెం లుక్‌ ఛేంజ్‌ చేసిన ఫోటోలను కూడా పోస్ట్‌ చేశాడు. అభిమానులు తన లుక్‌ని ఎలా ఏక్‌సెప్ట్‌ చేస్తారో చెక్‌ చేసేందుకే రామ్‌ అలా చేశాడు. అలా ప్రస్తుతం ఓ బెస్ట్‌ లుక్‌ని తన తదుపరి సినిమా కోసం రామ్‌ ఖరారు చేశాడని సమాచారమ్‌. అంటే రామ్‌ కొత్త సినిమాలో సరికొత్త లుక్‌తో దర్శనమిస్తున్నాడన్న మాట. 'నేను శైలజ' ఫేం కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట.

ఈ సినిమా రామ్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీగా సక్సెస్‌ని తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వచ్చిన 'హైపర్‌' సినిమా నిరాశ పరచడంతో మళ్లీ ఈ డైరెక్టర్‌తోనే నెక్స్ట్‌ సినిమా టేకప్‌ చేశాడు రామ్‌. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారమ్‌. అలాగే ఈ ఏడాదే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంతేకాదు ఈ గ్యాప్‌లో ఇంకో సినిమాకి కూడా రామ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలియవస్తోంది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయట. అలాగే మరో హీరోయిన్‌కీ ఈ సినిమాలో స్థానం ఉన్నట్లు తెలియవస్తోంది. అయితే హీరోయిన్స్‌ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam