Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

మహానటి సావిత్రిగా కీర్తి సురేష్‌

keerti suresh act mahasavitri movie

తెలుగు సినీ పరిశ్రమలో మహానటి అంటే సావిత్రి మాత్రమే. అలనాటి ఈ మేటి నటి సావిత్రి అంటే అందరికీ గౌరవం. తెలుగు సినిమా ఉన్నంతకాలం సావిత్రిని తెలుగు సినీ పరిశ్రమ మర్చిపోలేదు. సినీ నటిగా ఆమె సాధించిన విజయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందంటారు ఆమె గురించి తెలిసినవారు. అలాంటి మహానటి జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కడమంటే ఎంత గొప్ప విషయం? ఎప్పటినుంచో జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చి 'మహానటి సావిత్రి' జీవిత కథ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం చాలామంది నటీమణుల్ని పరిశీలించారు. సావిత్రిలా కాకపోయినా, ఆ స్థాయిలో హావభావాలు పండించగల నటి అవసరం.

అందుకే నటీమణుల కోసం అన్వేషణ అంత తేలిగ్గా ఓ కొలిక్కి రాలేదు. చివరికి కీర్తి సురేష్‌ని ఎంపిక చేయడంతో 'మహానటి సావిత్రి' పట్టాలెక్కడానికి రంగం సిద్ధమయ్యింది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో అందాల తార సమంత నటించనుంది. నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌, ఆ సంస్థ నుంచి వచ్చిన మరో సంస్థ స్వప్న సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించనుంది. మహానటి సావిత్రి జీవిత గాధ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం. దాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న చిత్ర యూనిట్‌ని అభినందించకుండా ఉండలేం. 

మరిన్ని సినిమా కబుర్లు
bahubali 2 is comming