Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
samanta ana nag in room

ఈ సంచికలో >> సినిమా >>

మెగాపవర్‌ స్టార్‌ మొదలు పెట్టేస్తున్నాడు

megastar start

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ ప్రయోగాల బాట పట్టాడు. ఈ క్రమంలో అతని తాజా చిత్రం సరికొత్తగా పట్టాలెక్కుతోంది. విలక్షణమైన చిత్రాలను రూపొందించడంలో దిట్ట అయిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ రూపొందించనున్న ఈ చిత్రం కోసం రామ్‌చరణ్‌ బాగా గడ్డం పెంచేశాడు. రెండు దశాబ్దాల క్రితం నాటి కాలానికి సంబంధించిన కథ అట ఇది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ అందమైన ప్రేమకథగా ఈ సినిమా గురించి అందరూ చెప్పుకుంటున్నారు. దానికి తగ్గట్టే సినిమా ప్రారంభోత్సవ సమయంలో ఓ లుక్‌ని విడుదల చేశారు. స్కెచ్‌ తరహాలో ఉన్న ఆ లుక్‌లో రామ్‌చరణ్‌, కావడి పట్టుకుని ఉన్నాడు. పంచె కట్టులో వెనకనుంచి కనిపిస్తున్న రామ్‌చరణ్‌, అభిమానుల్ని ఆ ఫొటోతోనే ఖుషీ చేసేశాడు. ఈ సినిమా కమర్షియల్‌ జోనర్‌కి భిన్నంగా ఉంటుందట. అయినప్పటికీ కూడా మంచి ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందనే నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్‌. 'ధృవ' సినిమా కోసం కూడా రామ్‌చరణ్‌ ఇలాంటి ప్రయోగమే చేశాడు. రెగ్యులర్‌గా మాస్‌ సినిమాలు చేసే రామ్‌చరణ్‌ ఇప్పుడు పంథా మార్చాడు. కొత్త కొత్త సినిమాలు ట్రై చేస్తున్నాడు. రామ్‌చరణ్‌ సరసన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించనుంది. చరణ్‌ సోదరి సుష్మిత, ఈ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam