Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 24th march to 30th march

ఈ సంచికలో >> శీర్షికలు >>

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గురించీ వివిధ పవిత్రగ్రంధాల్లోని అంశాలు.. - హైమవతి ఆదూరి

sri satya sai baba information

 అగస్త్య నాడీ గ్రంధంలోనూ,బుధ నాడిలో నూ ,శుక్రనాడి గ్రంధంలోనూ,బ్రహ్మనాడిలోనూ,పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బద్రపరచబడిన నాడి గ్రంధంలోనూ,పరాశర మహర్షి రచిం చిన పద్మ పురాణంలోనూ,శ్రీ సత్య సాయి బాబా వారిని గురించిన అనేకవిషయాలు వెలుగు లోకి వచ్చాయి.

"సత్య సాయి బాబా రోగ నివారణ కేవలం విబూదితో, ఆశీస్సులతో , మాటలతో నయం చేసే వారు.  సంకల్ప మాత్రం చేతనే సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించిన సందర్భాలు అనేకం. అనేక విద్యా సంస్థలను స్థాపించి, మానవతా విలువలతో కూడిన , ఉత్తమ ,ఉన్నత భారతీయ సంస్కృ తి తో కూడిన  ఉచిత విద్యను  అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఆద్యాత్మికతను, భారతీయ సంస్కృతినీ పునరుధ్ధరించి, వేదధ్ధరణ, పండిత పోషణ, ధర్మోద్దరణ, ధర్మసంస్తాపన ,భక్తరక్షణ చేసేందుకే ఈ అవతారంవచ్చింది.ఈవిషయం  చాలామంది వెళ్ళి స్వయంగా గమనించి తెల్సుకున్న విషయం. ఎన్నో 'వాహినుల 'ద్వారా , భారతీయ సంస్కృతీ సారాన్నీ, వేదసారాన్నీ , ఉపనిషత్తులనూ సులభ భాషలో పండిత పామరులకు సైతం అర్ధ మయ్యేలా అనేక గ్రంధాలు అందించారు బాబావారు. మానవులలో ఆధ్యాత్మికతత్వాన్ని పెంపొందింపచేశారు.

సత్యసాయి బాబావారు  నిరంతరము తన్మయత్వంలో  ఉంటూ, భక్తులకు దర్శన, స్పర్శన, సంభాషణలు అందిస్తూ దూరప్రాంతాల భక్తులను  స్వయంగా ట్రాన్స్ లో వెళ్ళి, దీవెన లందించీ కాపాడుతూ వచ్చారు.

ప్రశాంతి నిలయం లో రోజూ వేలసంఖ్యలో  వచ్చేభక్తులకు  స్వామి వారిని దర్శించు కుంటూ ధన్య జీవులై ,మహదానందంగా, తమ సమస్యలన్నీ పోగొట్టుకుని వెళ్లలేక వెళ్ళే వారు.బాబావారు సత్య ధర్మ  శాంతి ప్రేమ, అహింసా మార్గాలలో శాశ్వతానందాన్ని లోకంలో స్థాపించి, విశ్వవ్యాప్తం చేశారు. మానవులకు సేవ చేయటంలో మానవ జాతికంతా ఆదర్శ ప్రాయంగా స్వయంగా సేవచేసి ,నిరంతరం ఆనందస్వరూపులుగా ఉండే అవతార పురుషులు.

బ్రహ్మనాడిని పరిశీలించిన ఒక పండితుడు  చెప్పిన అంశాలు శ్రీ సత్య సాయిబాబావారి విషయంలో అక్షర సత్యాలు. మానవ మాత్రుని వలె జీవిస్తూ మానవుల మధ్య నివసించే మాధ వుడు.తల్లికి ఇచ్చినమాట ప్రకారం బాబావారు  పుట్టపర్తి వదలి వెళ్లలేదు. పుట్టపర్తే ఒక ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం గా విలసిల్లుతున్నది.

బాబావారు  శివశక్తి స్వరూలుపు. షిరిడి సాయి శివస్వరూపం.తర్వాతి అవతారమే సత్యసాయి బాబావారు.చిత్రావతి నదీ తీరంలో, ప్రశాంత వాతావరణంలో మానవాకారం స్వీకరించిన బాబావారు పరమ శాంతమూర్తి!ప్రేమ స్వరూపులు. గొల్లపల్లి అనేపేరుతో ఉన్న ఆగ్రామ పుట్టవర్ధినిగా,పుట్టపర్తి గా మారింది.నేడు ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం గలదిగా ఉంది.

మరిన్ని శీర్షికలు
Beerakaya tometo chutney