Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

బాహుబలి-2 వెయ్యి కోట్ల అద్భుతం.!

bahubali 2 expectations  thousand crores

తెలుగు సినీ పరిశ్రమలో ఓ సినిమా వంద కోట్లు సాధించిందంటే అదొక అద్భుతంగా పరిగణిస్తున్నాం. ఇంతవరకు 'బాహుబలి ది బిగినింగ్‌', 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలు మాత్రమే ఆ ఘనతను సాధించాయి. ఈ ఏడాది వంద కోట్ల ఫిగర్‌ని దాటేయడానికి చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే అందరి దృష్టి మాత్రం 'బాహుబలి ది కంక్లూజన్‌'పైనే ఉన్నాయి. అందుకు కారణమేంటంటే, ఈ సినిమాపై వెయ్యి కోట్ల వసూళ్ళ అంచనాలు ఉండటం. ఇంతవరకు తెలుగు సినిమా ఎప్పుడూ ఊహించని నంబర్‌ అది.

వెయ్యి కోట్లు అనే ఫిగర్‌ని తెలుగు సినిమానే కాదు, బాలీవుడ్‌ సినిమా కూడా ఇంతవరకు ఆశించలేదు. అసాధ్యమనుకున్న ఆ ఫిగర్‌ని టచ్‌ చేసే సత్తా కేవలం 'బాహుబలి ది కంక్లూజన్‌'కి మాత్రమే ఉందని బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారంటే అది తెలుగు సినిమాకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకోవలసి ఉంటుంది. 'బాహుబలి ది కంక్లూజన్‌' అందరి అంచనాల్ని అందుకుంటూ, వెయ్యి కోట్లు సాధించగలిగితే అదొక అద్భుతం. ఆ అద్భుతాన్ని, అసాధ్యమైన ఆ వెయ్యి కోట్ల కలని సాకారం చేసిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఆయనొక్కడే కాదు, సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ మన తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటినవారవుతారు. ఆ వెయ్యి కోట్ల అద్భుతం అనే కల సాకారమవుతుందో లేదో చూడాలిక. 
 

మరిన్ని సినిమా కబుర్లు
nagarjuna was so glamour in raju gari gadi 2