Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mister confidence super

ఈ సంచికలో >> సినిమా >>

బాలయ్యని పూరి ఎలా చూపించనున్నాడో!

balayya with puri jagannath

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడనేది చాలా బిగ్‌ న్యూస్‌. ముందుగా గాసిప్‌ వచ్చినప్పుడు దీన్ని ఎవరూ నమ్మలేదు. సినిమాని అనౌన్స్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన పూరి జగన్నాథ్‌, షాక్‌ల మీద షాక్‌ ఇస్తూనే ఉన్నాడు.  సినిమా ప్రారంభమెప్పుడో అనౌన్స్‌ చేసిన రోజే, విడుదల తేదీని కూడా అనౌన్స్‌ చేసేశాడు. అన్న మాట ప్రకారం సినిమా షూటింగ్‌ని కూడా ప్రారంభించేయడంతో ఆయన స్పీడ్‌ చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తోంది అందరికీ. అప్పుడే సినిమాలో కీలకమైన సన్నివేశం చిత్రీకరణ కూడా పూర్తయిపోయిందట. అది కూడా సూపర్బ్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ అని పూరి జగన్నాథ్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. అద్భుతమైన సెట్‌లో ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ని చిత్రీకరించారు. సెట్‌ వేయాలంటేనే ఒక్కోసారి వారాల తరబడి సమయం పట్టేస్తుంది. కానీ పూరి జగన్నాథ్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసెయ్యగలడు కదా. అందుకే అనుకున్నదే తడవు చకచకా సెట్‌ వేయించేసి, యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ పూర్తి చేసేశాడట.

ఈ క్రమంలో బాలకృష్ణ నుంచి అందిన సహకారం మరువలేనిదని, సెట్స్‌లో ఆయన ఎనర్జీ చూస్తే తనలో కొత్త ఎనర్జీ పుట్టుకొచ్చిందిన అంటున్నాడు పూరి జగన్నాథ్‌. అయితే పూరి సినిమాలో బాలకృష్ణ ఎలాంటి గెటప్‌లో కనిపించనున్నాడో ఎవరికీ తెలియడంలేదు. అది ఇప్పటికైతే సస్పెన్సే. పూరి సినిమాల్లో హీరో చాలా డిఫరెంట్‌గా ఉంటాడు. అందుకే బాలయ్య గెటప్‌పై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. దానికి పూరి ఎప్పుడు తెరదించుతాడో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam