Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> బ్లైండ్ లేడీ

blind lady

“బాస్! మాలతీ చంద్ర ..ఈ మధ్య మర్డర్ అయిన చంద్రవర్ధన్..గారి భార్య మీ అప్పాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు..మీరు టైం ..చెపితే?”

తన సెక్రటరీ స్టెల్లా ఫోన్ కట్ చేస్తూ..

“అర్జెంటు అయితే యిప్పుడే పంపించు లేదంటే   ...”

“బాస్ ! ఆమె చాలా ఆందోళనగా వున్నారు..ఏడ్చేస్తున్నారు .”

“ముందు కన్ సోల్ చేయండి. ఆమె రిఫ్రెష్ అయ్యాక ..పంపించు .”

“నమస్తే డిటేక్టివ్ బాలిగారూ !” 

పదేళ్ళ అమ్మాయితో వచ్చిన మాలతీచంద్ర ..ముర్తీభవించిన దైన్యానికి ప్రతి రూపంలా వుంది.ఆమె తో పాటు  వచ్చిన స్టెల్లా నెమ్మదిగా  యిద్దరినీ కూర్చోబెట్టింది.తను తన నోట్ పేడ్ తో ..మరో కుర్చీలో సెటిల్ అయిపోయింది .

పూర్తిగా నలభై కూడా దాటని వయసులో..అరవై దాటిన లేడీ లా వుంది .

“మాలతి గారూ ! మీ వారి మర్డర్ కేస్ దాదాపు ఫైనల్ స్టేజి కొచ్చిందని పేపర్ న్యూస్.”

“న్యూస్ కరక్టే బాలిగారు ..దానితో నాబ్రతుకే ఆఖరి దశలోకి వస్తుంది. మా లాయర్ ఇప్పటికే చేతులేత్తేసారు..

విధవగా మారిన నా బ్రతుకు అనాధగా దీని బ్రతుకు  దినదిన గండంగా వుంది . పేరుకు మాత్రం ఓ పెద్ద బిల్డర్ భార్యనే..కానీ బ్రతుకు మాత్రం అనాధ బ్రతుకే .భవిష్యత్తు అంతా అంధకారమే.”

“మీ బాధ అర్ధం చేసుకో గలను. ఇది  కోర్ట్ కేసు.. యిందులో మేము ఏమి చేయ గలమో అర్ధంకావడము లేదు.”

“మా లాయర్ గారు రాంప్రసాదు గారు  ..ఆయన మీకు ఫ్రెండ్ అని చెప్పారు. నేను చేయ గలిగింది చేశాను. జూలీ బ్లైండ్ కాదని నిరూపించ లేక పోయాను. ఒక బ్లైండ్ లేడీ తనకన్నా బలమైన వ్యక్తిని కత్తితో..సూటిగా గుండెల్లో పొడిచి యెలా హత్య చేయగలదు ?పోలీస్ ఇప్పటికే ఈ కేస్ ను ఆత్మహత్యగా నిర్ణయించి ఫైల్ మూసేసారు . ఈ ఒక్క పాయింట్ మీదే కోర్ట్ కూడా  కేస్ కొట్టి వేసే ఛాన్సు వుంది అంటున్నారు . నా పేరు చెప్పి తను ఏమైనా చేయ గలడేమో అడిగి చూడండి..నేనూ ఫోన్ చేసి కేస్ గురించి వివరిస్తాను.ఇక మీ అదృష్టం మీద ఆధారపడివుంది అన్నారు.. బాలి గారూ ! మీరే మాకు దిక్కు .ఆస్తి కన్నా నా భర్తను అమానుషంగా పొట్టను పెట్టుకున్నఆ మాయలాడి కి శిక్ష పడాలి .”
ఆపుకోలేని దుఖంతో గట్టిగా ఏడ్చేసింది. తల్లిని పట్టుకుని ఆ పాప కూడా..ఏడుపు మొదలు పెట్టింది. స్టెల్లా లేచొచ్చి యిద్దరిని ఓదార్చింది.

“మాలతిగారూ..మీ బాధ నాకు అర్ధ మయ్యింది..నేను రాంప్రసాద్ తో మాట్లాడుతాను. కేస్ వివరాలు తెలుసుకుని నేను ఏమైనా చేయగలిగితే తప్పకుండా చేస్తాను.మీరు మీ ఫోన్ నెంబర్ అడ్రస్  మా శిరీషకు యిచ్చి వెళ్ళండి ..కేస్ ఫైనల్ హేయరింగ్ నెక్స్ట్ వీక్ అన్నారు కదూ?”

“అవును బాలి గారూ..యివ్వాళ పది. .పదిహేడో తారీకున కేస్ ఆఖరి వాయిదా. మీరే మాకు దిక్కు..”

“అమ్మా ! నేను యేదైనా చేయగలిగితే తప్పకుండా చేస్తాను.మీరు బాధ పడకండి.”

“మీ నోటి మాటతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. వస్తాను బాలీ గారూ!”

“అవినాష్ !లాయర్ రాంప్రసాద్ తో మాట్లాడి కేస్ పూర్వాపరాలు తెలుసుకో. స్టెల్లాకు .. శిరీషకు ఈ కేస్ కుసంబoధించిన టీవీ  క్లిప్పింగ్స్ వుంటే సార్ట్ చేసి  పెన్ డ్రైవ్ లో లోడ్ చేయమని చెప్పు.”

బాలి తన అసిస్టెoట్ అవినాషు కు చెప్పాడు.

*****

“బాస్! లాయర్ గారితో మాట్లాడాను. కేస్ కు సంబంధించిన ఫైల్స్ మెయిల్ చేస్తానన్నారు.ఆయన బ్రీఫ్ చేసిన వివరాలు..

“చంద్రవర్ధన్ సిటీ లో పేరు మోసిన బిల్డర్.ఆయన మొదటి భార్య మాలతీ ..సంవత్సరం క్రితమే  ఈ జూలీ అనే యువతి ఆయన జీవితం లోకి వచ్చిందట . మొదట ఆఫీస్ లో పీయస్ గా చేరిందట.యెలా ట్రాప్ చేసిందో వన్ ఫైన్ మార్నింగ్ చంద్రవర్ధన్  ఇంట్లో కి ఎంటర్ అయిపోయిందట. బిల్డర్ కాక ముందు చంద్ర సామాన్య వ్యక్తి .. బిల్డర్ గా బాగా కలిసొచ్చాక ..తాగుడు ..పేకాట క్లబ్బులతో బాటు అమ్మాయిల వ్యసనం బాగా అధికమై పోయి భార్యా బిడ్డలకు దూరమై పోయి జూలీ తోనే కాపరం పెట్టేశాడని..పుకారు.”

“ముందు చంద్ర వర్ధన్ హౌస్ ని కాన్సట్రేట్ చెయ్ ..నువ్వో జాకినో ఎవరో ఒకరు ఆ ఇంట్లో చేరి పోవాలి. ప్రతి క్షణం జూలీ  ని గమనించాలి.ఎలాంటి అనుమాన మొచ్చినా రికార్డు చేయాలి.నో టైం ..మూవ్.. ఫాస్ట్.”

“ఓకే బాస్! నేను జాకీ ఆ పని మీదే వుంటాం .”    

****

“మిస్టర్ బాలీ! చంద్రవర్దన్ కధ అనేకంటే  జూలీ సస్పెన్సు స్టొరీ అంటే బాగుంటుంది.  ఎలా ట్రాప్ చేసిందో ..మాలతీ అవుట్.. తను ఇన్.. చంద్రవర్ధన్ అవుట్ ఫరెవర్. జూలీ మాలతిని ఇంటి నుంచి పంపించేశాక తన ప్లాన్ అమలు చేసింది.ఆస్తి తన పేరున రాయాలని సతాయించడం మొదలు పెట్టింది. చంద్రవర్ధన్ కు జూలీ స్వరూపం అర్ధమైనట్లుంది ..కొంత రియలైజేషన్ వచ్చినట్లుంది తన భార్యా బిడ్డలకు అన్యాయం చేయ కూడదని..ఆస్తి యిద్దరికీ రాయాలనే ఆలోచనని పసిగట్టిన జూలీ  వీలునామా  రాయక ముందే చంద్రవర్ధన్ ను లేపేయాలనే ఐడియా ఫాo చేసుకుంది. అయితే ఓ రోజు ఫ్రెండ్స్ తో బాగా డ్రింక్ చేసి ఇంటికొచ్చిన భర్తతో  గొడవ పడింది. ఆ నిషాలో చంద్రవర్ధన్ నెట్టేయడంతో ..టేబుల్ కార్నర్ మీద పడిపోయి కనుచూపు కొల్పోయిందనేది.. డాక్టర్స్ ప్లస్ బ్లైండ్ స్కూల్ నిపుణులు నిర్ధారించారు.”

“ఓకే ! చంద్ర మర్డర్ యెలా జరిగింది? యెవరు చేసుంటారు?”

“లోకం కోడై కూస్తోంది జూలీ నే హంతకురాలని. కాని కోర్ట్ మాత్రం నమ్మడం లేదు.”

“కోర్ట్ నమ్మకపోవడానికి రీజన్స్?

“ బ్లైండ్ లేడీ తనకంటే బలవంతుడైన మగవాడిని తిన్నగా గుండెల్లో పొడిచి యెలా హత్య చేయగలదని ..” దానికి మీ అర్గ్యుమెంట్స్ యేమిటి?”

“నెంబర్ వన్ ..తాగిన మైకంలో స్పృహ తప్పిన భర్తను చూపులేకపోయినా చంపడం అసాధ్యం కాదని . నెంబర్ టు..ఆమెకు చూపు పూర్తిగా పోలేదని ..ఆమె బ్లైండ్డ్ లేడీ కాదని .”

“కానీ మీరు ఆమె  బ్లైండ్ కాదని నిరూపించ లేక పోయారు .అంతేనా?”

“ఎగ్జాట్లి అంతే . మేము చేయని ప్రయత్నాలు లేవు . ఆ ఇంట్లో సిసి కెమారా కూడా ప్లాంట్ చేయించాను. ఈ మహా నటి యాక్షన్ ముందు ఒరిజినల్ బ్లైండ్ వాళ్ళు కూడా బలాదూరే.కోర్ట్ సిసి కెమారా రికార్దింగ్ ..కొట్టేసింది ..ఆ రికార్దిండ్ ఆమె కే ఫేవర్ గా మారిపోయింది.”

“మీ కోర్ట్ లకు సాక్ష్యాలే తప్ప నిజాలు అక్కరలేదు . అది సరే ముందు జరిగింది చెప్పు . మర్డర్  కు లీడ్ చేసిన సంఘటలు కావాలి.”
“ఓకే మిస్టర్ బాలీ !

మాలతి స్టేట్మెంట్ ప్రకారం ..ఆ రోజు అంటే మర్డర్ జరిగిన రోజు సాయంత్రం మిస్టర్ చంద్ర  ఫోన్ చేసారట. ఆస్తి పంపకాలు చేస్తున్నాని  అమ్మాయిని తీసుకొని రాత్రికి బయలు దేరి  రమ్మని . మాలతి యర్లీ మార్నింగ్ వచ్చే టైం కు ముందే మర్దర్ జరిగి పోయిందట . పోలీస్ లెక్క ప్రకారం అర్ధ రాత్రి పన్నెండు గంటల టైం లో మర్డర్ జరిగింది. బ్లైండ్ లేడీ మర్డర్ చేయలేదు ..యిది ఖచ్చితంగా ఆత్మ హత్యే నని కేస్ మూసేశారు.బాగా లంచాలు చేతులు మారాయని నా అనుమానం.”

“ఓకే..ముందు చంద్రవర్ధన్ మృత దేహాన్ని చూసిందిఎవరు.?”

“పనమ్మాయి పేరు రంజిత .ఇంటికి వెళ్ళేటప్పుడు బయట లాక్ చేసుకొని వెళ్ళిపోయి మార్నింగ్ వచ్చి తనే తలుపులు తెరుస్తుందట .ఆ తర్వాతే మిగతా వర్కర్స్ వస్తారు. ఆ రోజు రంజిత వచ్చే టైం కి మాలతి వచ్చిబయట వెయిట్ చేస్తోందట . ఇద్దరూ ఒక్కసారే లోపలికెళ్ళి డెడ్ బాడీ ని చూసారట.”

“ఆ టైములో జూలీ యెక్కడ వుందని చెప్పారు.?”

తనకి చూపు లేనందువలన రంజిత వచ్చేంత వరకూ తన బెడ్ రూం లోనే ఉంటుందట. అలాగే ఆ రోజు కూడా ఉన్నదన్నారు. రంజిత తో బాటు ఏడ్చు కుంటూ వెళ్ళి మాలతియే జూలీ ని లేపి చెప్పిందట .

అంటే ఓ హంతకురాలికి మాలతి గారే ఎలిబీ అన్నమాట .

ఒక విధంగా అంతే.అక్కడనుండి   జూలీ రంజిత సాయంతో వెళ్ళి చంద్ర శవం మీద పడి భయంకరంగా ఏడ్సేసి పోలీస్ వచ్చే టైం కు స్పృహ తప్పి పడిపోయిందట. పోలీసులే ఫస్ట్ ఎయిడ్ చేసి డాక్టర్ ని పిలిపించారట.

“నౌ ఫర్గెట్ ఎవ్విరీథింగ్. నౌ టెల్ మీ యువర్ ఫైనల్ ట్విస్ట్..ఐ మీన్ ఈ కేసులో మానుండి యెలాంటి హెల్ప్ కావాలనుకుంటున్నావు?”
“మాలతి పక్షాన న్యాయం వుందని నా అభిప్రాయం .కానీ తగిన సాక్ష్యాలు లేక ఏమి చేయలేక పోతున్నాను. ఇంకా ఆరు రోజుల టైమ్ మాత్రమే వుంది.జూలీ మాములు స్త్రీ కాదని ..ప్లాన్ ప్రకారమే చంద్రను హత్య చేసి నాటకాలాడుతుందని నా అనుమానం.”

“ఫైనల్ హియరింగ్ అంటున్నావు. యిప్పుడు సాక్ష్యాలు అంటే ?”

“నేను మేనేజ్ చేయగలను. డబ్బుకు లోకం దాసోహం..పైగా జడ్జి గారిది మా కులమే. కేకే వన్ అన్నమాట.ఫైనల్ హియరింగ్ కు ముందు ఓ అవకాశo  కోరుతాను ..తీసుకుంటాను.”

“మా జాకి అవినాష్ లు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో రిజల్ట్ చెపుతాను . ఈ కేసు కు సంబంధించిన  అవైలబుల్ మెటిరియల్ మా అవినాష్ కు ఇవ్వు. నేను కూడా ఆ బ్లైండ్ లేడీ నటన చూడాలనుకుంటున్నాను.

“థాంక్స్ మిస్టర్ బాలీ ! ”

****

“బాస్! యిది మన శిరీష గేదర్ చేసిన క్లిప్పింగ్స్ కు సంబంధించిన పెన్ డ్రైవ్..ఫైల్స్ అన్నిలాయరు గారు  మెయిల్ చేశారు. మన జాకీ రంజిత ను ట్రాప్ చేసి తన బాయ్ ఫ్రెండ్ గా ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోయాడు. కానీ ఫలితం  మాత్రం నిల్ . రంజిత యెలా మేనేజ్ చేసిందో తన బాయ్ ఫ్రెండ్ గా జూలీ కీ పరిచయం చేసి తనకు హెల్పర్ గా తనతోనే ఉండేందుకు అనుమతి కూడా సoపాదించిoదoట.రంజిత కూడా మామూలు అమ్మాయి కాదని జాకి అభిప్రాయము . రెండు రోజుల తర్వాత కూడా యెలాంటి క్లూ దొరకలేదట. జాకీ కూడా  యింకా డైలమా లోనే వున్నాడు.జూలీ బ్లైండ్ లేడీ యా కాదా ? తన అభిప్రాయాన్ని చెప్పలేక పోతున్నాడు.కానీ జూలీ తో బాటు రంజిత లో కూడా ఏదో మిస్టరీ దాగి వుందని ..అదేమిటో అర్ధం కావడం లేదు ..ప్రయత్నిస్తున్నాను అంటున్నాడు.”

“ఓకే నేను చెప్పిన ఆ  విషయo.. వెరీ ఇంపార్టెంట్ ?

ఆల్ రెడీ.. రెడీ బాస్ !

*****

ఆ రోజు.. బ్లైండ్ లేడీ కేసులో  తీర్పు ..చెప్పే రోజు . చానెళ్ళ బూస్ట్ అప్  మూలంగా రాష్ట్రంలోనిఅన్నిప్రాంతాలనుoచి.. పెద్ద యెత్తున వచ్చిన ప్రేక్షకుల తో కోర్ట్ గ్యాలరీ నిండిపోయింది .అన్ని చానెళ్ళ రిపోర్టర్స్ తో బాటు ప్రింట్ మీడియా  జనాలతో క్రిక్కిరిసి పోయింది.

డిటేక్టివ్ బాలి సూచనలతో కోర్ట్ హాల్ సెట్టింగ్ లో మార్పులు చేశారు.బ్లైండ్ లేడీ సీట్ జడ్జి గారి డయాస్ కు యెదురుగా విట్ నెస్ స్టాండ్ బ్లైండ్ లేడీ సీట్ కు వెనుకగా జడ్జి గారి అనుమతితో అరేoజ్ చేయిoచ గలిగాడు లాయర్ రాంప్రసాద్. ఉదయం పదిన్నర గంటలయిoది.
జడ్జి గారు చైర్ లో ఆసీనులయ్యారు .

బ్లైండ్ లేడీ ప్రక్క రంజిత జాకీలు నిలబడి వున్నారు .

జడ్జి గారి అనుమతి తో మాలతి లాయర్ రాంప్రసాద్ తన వాదనను ప్రారంభించాడు .

యువరానర్ ! కేస్ ఫైనల్ హియరింగ్ కు ముందు నా అభ్యర్ధనతో అతి ముఖ్యమైన సాక్షిని ప్రవేశ పెట్టెందుకు అనుమతిచ్చిన కోర్ట్ వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను . బ్లైండ్ లేడీ గా పిలవబడే ఈమె పేరు జూలీ . ప్రముఖ కంట్రాక్టర్ చంద్ర వర్ధన్ రెండవ భార్య. ఈమే హత్య చేసిoదన్ననా క్లయింట్  మాలతి గారి అభి యోగాన్నిబలపరిచే  తగిన సాక్ష్యాలు చూపిoచ లేక  పోయాను .
బ్లైండ్ లేడీ ముఖంలో తొంగి చూసిన చిరునవ్వు జడ్జ్ గారి దృష్టిని తప్పించుకోలేక పోయింది . వెంటనే తన తప్పును గ్రహిoచినట్లు సర్దుకుంది జూలి.  లాయర్ రాంప్రసాద్ తన వాదనను కొనసాగించాడు.

యువరానర్! యింతకాలం చంద్రవర్ధన్ చనిపోయాడనే వాదన తప్పు అని మనవి చేసుకుంటున్నాను  ! చంద్రవర్ధన్ చనిపోలేదు.ఆయన సజీవంగానే వున్నారు.

కోర్ట్ హాలoతా..నిశ్శబ్దం తో గడ్డ కట్టుకు పోయింది .

డిఫెన్స్ లాయర్ నిలబడి అడ్డు పడబోతుంటే జడ్జి గారు చేతి సైగతో  “నో “ అని వారించారు .

జూలీ ముఖంలో రంగులు మారడం జడ్జి గారి ద్రుష్టి నుంచి గాని ప్రక్క చాంబర్లో ..సిసి టివి మానిటర్ ముందున్న బాలీ బృందాన్ని గాని తప్పించుకోలేకపోయింది .

బాలి తన ప్రక్కనున్న పేస్ రీడింగ్ ఎక్ష్ పర్ట్ ను చిరునవ్వుతో చూసాడు .

దానికి సమాధానంగా ప్లీజ్ వెయిట్ అన్నట్లు చూసాడు ఎక్ష్ పర్ట్ మిస్టర్ గోయంకా .

యువర్ ఆనర్! మీరు అనుమతి  యిస్తే చనిపోయాడని భావిస్తున్న మిస్టర్ చంద్ర వర్ధన్ను మా ఆఖరి సాక్షిగా ప్రవేశపెడతాను.
గడ్డ కట్టుకుపోయిన నిశ్శబ్దం కరిగి పోయినట్లు  ఒక్కసారిగా కలకలంతో ..కల్లోల మై పోయింది కోర్ట్ హాల్.

జడ్జి గారి హెచ్చరికతో సద్దుమణిగింది.

బ్లైండ్ లేడీ బాడీ లేoగ్వేజ్ లోమార్పు వచ్చేసింది. బాలి ముఖం చిరునవ్వుతో వెలిగిపోతుంటే ..మిస్టర్ గోయంకా అర్ధమైనట్లు తల వూపాడు .
డిఫెన్స్ లాయర్ ..దిక్కులు చూస్తుoటే..రాంప్రసాద్ చిన్నగా నవ్వుకున్నాడు.

మిస్టర్ రాంప్రసాద్! యువర్ రిక్వెస్ట్ గ్రాoటెడ్..ప్రొసీడ్.

చంద్రవర్ధన్..చంద్రవర్ధన్..చంద్రవర్ధన్..

కోర్ట్ బంట్రోతు మూడుసార్లు  పిలిచాడు .

“కమింగ్ సర్! “

మాట్లాడుతూ ..మాలతీ దేవి ..పదేళ్ళ కుమార్తె శాలినితో నడిచి వస్తున్న వ్యక్తిని చూస్తూనే..హాలంతా కరతాళ ధ్వనులతో మారు మ్రోగి పోయింది.

ప్రమాదాన్ని పసికట్టిన రంజిత జూలీ ని టచ్ చేసి హెచ్చరించాలనే ప్రయత్నాన్ని గమనించిన జాకీ ..రంజిత చేతిని  కదలకుండా గట్టిగా పట్టేసాడు.

“కమింగ్ సర్ “అన్న చంద్రవర్ధన్ వాయిస్ వింటూనే బ్లైండ్ లేడీ బాడీ లో మారుతున్న వైబ్రేషన్స్ స్పష్టంగా సిసి మానిటర్ లోకనిపిస్తుంటే గోయంకా బాలికి పాయింట్ చేసి చూపిస్తూ ఏదో వివరిస్తుంటే ..అప్పటికే దాదాపు కన్ఫం చేసుకున్న బాలి ..

“యూఆర్..రైట్ మిస్టర్ గోయంకా. ప్లీజ్ వెయిట్ అండ్ సీ ద డ్రామా.”

అప్పటికే బ్లైండ్ లేడీ వెనుకున్న విట్నెస్ స్టాండ్ లో నిలబడిన చంద్రవర్ధన్ జడ్జ్ గారిని విష్ చేసి తన గొంతు విప్పాడు “యువరానర్! నా పేరు చంద్రవర్ధన్.ఆ రోజు రాత్రి నా రెండో భార్య మీ ముoదున్న  జూలీయే..నా మీద హత్యా ప్రయత్నం చేసింది. “

ఆ మాటలు విoటునే..ఒక్కసారిగా వెనక్కి తలతిప్పి విట్నెస్ స్టాండ్ వంక చూసి ..అందులోని వ్యక్తిని చూస్తూనే..హిస్టారిక్ గా

“ నో...హి ఈజ్ ఏ ఛీటర్..చంద్రా కాదు ..”

నోరుజారి హటాత్తుగా ఆగిపోయింది .

గోయంకా లేచొచ్చి బాలీ ని కౌగలిoచేసుకున్నాడు .

*****

కోర్ట్ సెమినార్ హాల్.

చానళ్ళ కెమారాలు ...రిపోర్టర్  ల తో హాల్ క్రిక్కిరిసిపోయింది. 

హైకోర్ట్ లాయర్ల తో బాటు జడ్జిలు కూడా హాజరయ్యారు.

అoదరిలోనూ ..క్యూరియాసిటి. ఫైనల్ హియరింగ్ కొచ్చిన కేస్ హటాత్తుగా మారిపోవడం ..నిర్దోషి అనుకున్నజూలి  ..దోషి గా మారడం ..బ్లైండ్ లేడీ గా అనుకున్న వ్యక్తి బ్లైండ్ కాదని తేలిపోవడం ..వూహలకoదని ట్విస్ట్ లతో .. ఈ కేస్ అందరిలో తెలుసు కోవాలన్న జిజ్ఞాస కలిగించింది .
అoదరిని విష్ చేసి డిటేక్టివ్ బాలి తన పరిశోధన ను వివరించాడు .

“శ్రీమతి మాలతి గారు నా ఆఫీసులో తన గోడు చెప్పుకుంటూ..

“నాకు  ఆస్తి కాదు ముఖ్యం ..నా భర్తను పొట్టను పెట్టుకున్న ఆ మాయలాడికి శిక్ష పడాలి   అన్నారు..” ఆమె ఆవేదన నా గుండెల్ని తాకింది.నా స్నేహితుడు లాయర్ రాం ప్రసాద్  వ్యక్తపరిచిన అనుమానాల్లో నాకు రీజన్ కనిపిoచిoది.అప్పుడే చెన్నైవిజిపీగోల్డెన్ బీచ్ లో శిలావిగ్రహంలా రెప్ప వేయని మనిషి ఫ్లాష్ అయ్యాడు.నా దోస్త్ రవికిరణ్ సైకియాట్రిస్ట్..తో మాట్లాడాను. “

“ఆ అమ్మాయి బాగా ట్రైనింగ్ ..తీసుకుంది.జరగబోయే విషయాలలో ఆమె చాలా షార్ప్ గా రియాక్ట్ అవుతోంది. తన అసిస్టెంట్ రంజిత సాయం తో డ్రామా నడుపుతోంది .కానీ యెంత ట్రైనిoగ్  తీసుకున్నా షాక్ కొడితే చేతిని తీసుకోకుండా ఎవరూ ఉండలేరు.దానినే మనం అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం . అటువంటి సంఘటన క్రియేట్ చేయ గలిగితే ..కేస్ సాల్వ్ అయ్యే  ఛాన్స్ వుంది.అన్నాడు.”
“దాని పర్యవసానమే ఈ నాటకం .జడ్జి గారి సహకారం తో విజయవంతం అయ్యింది . మా అవినాష్,  చంద్ర వర్ధన్ వాయిసును స్టడీ చేసి అనుకరించాడు.అదే జూలీ కి షాక్ తెప్పించింది.ఒకే  ఒక్క క్షణంలో చంద్ర గొంతు  ..తనే హత్యా ప్రయత్నం చేసిందన్న స్టేట్మెంటు ..అసలు ఆస్తికోసం చంద్రను చంపిన ప్లాన్ తలక్రిoదు లవుతుoదే మోనన్న భయం  ఒక్కసారిగా మెదడును  డామినేట్ చేయడంతో తట్టుకోలేక పోయింది. తన నాటకాన్ని మర్చిపోయి బయట పడిపోయింది.”

బాలి మాటలు పూర్తి చేయక ముందే కరతాళ ధ్వనులతో హల్ మారుమ్రోగి పోయింది.

హఠాత్తుగా తన కూతురుతో వచ్చి బాలి పాదాల మీద పడిపోయింది శ్రీమతి మాలతీదేవి

.***

మరిన్ని కథలు
velakattagalavaa