Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

50 కోట్ల క్లబ్‌లో చేరిన 'కాటమరాయుడు'

katamarayudu  join in 50 crores club

ఉగాదికి ఐదు రోజుల ముందుగా ప్రేక్షకుల ముందుకొచ్చింది పవన్‌ కళ్యాణ్‌ సినిమా 'కాటమరాయుడు'. ఉగాది నాటికి 'కాటమరాయుడు' 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. డివైడ్‌ టాక్‌తో ప్రచారం జరిగినా కానీ పవన్‌ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. పవన్‌కళ్యాణ్‌ నాలుగోసారి ఈ ఘనతను సాధించాడు. 'గబ్బర్‌సింగ్‌', 'అత్తారింటికి దారేది', 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఇప్పటికే ఈ క్లబ్‌లో చేరాయి. 'గబ్బర్‌సింగ్‌', 'అత్తారింటికి దారేది' సూపర్‌ హిట్స్‌ కాగా, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' 50 కోట్ల క్లబ్‌లో చేరడం పవన్‌కళ్యాణ్‌ స్టామినాని తెలియజేసినట్లయ్యింది.

అలాగే 'కాటమరాయుడు' కూడా అభిమానులు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా వసూళ్ల పరంగా మాత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరే దిశగా పరుగులు పెడుతోంది. ఓవర్సీస్‌లో 1 మిలియన్‌ ఎప్పుడో దాటేసింది. డాలీ ఈ చిత్రానికి దర్శత్వం వహించారు. ముద్దుగుమ్మ శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. మరో పక్క పవన్‌కళ్యాణ్‌ తన తదుపరి సినిమా షూటింగ్‌లో బిజీ అవనున్నాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. ఇది కూడా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా తెరక్కెనుంది. 'అత్తారింటికి దారేది' సినిమాతో ఈ కాంబినేషన్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకుంది. అందుకే ఈ చిత్రంపై భారీగా అంచనాలున్నాయి. ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ ఈ సినిమాలో పవన్‌తో జోడీ కడుతోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
mister  comming