Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bahubali nabhuto nabahvishyat

ఈ సంచికలో >> సినిమా >>

నాగచైతన్య 'వేడుక' చూసేద్దామా?

nagachautanya act in veduka movie

నాగచైతన్య హీరోగా కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకి 'రారండోయ్‌ వేడుక చూద్దాం' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా పోస్టర్స్‌ని విడుదల చేశారు ఉగాది సందర్భంగా. ఆ పోస్టర్‌ పండగ వాతావరణాన్ని ప్రతిబింబించింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నాగ చైతన్య ఇద్దరూ జోరుగా హుషారుగా డాన్స్‌ వేస్తున్నారు ఆ లుక్‌లో. అలాగే ఇంకో లుక్‌లో మాస్‌ హీరోలా కనిపిస్తున్నాడు నాగచైతన్య. లక్కీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాతో తొలిసారిగా నాగ చైతన్యతో జోడీ కడుతోంది. అన్నపూర్ణా స్టూడియోస్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు

కళ్యాణ్‌ కృష్ణ. రెండో సినిమా కూడా అక్కినేని వారసుడితోనే తెరకెక్కించే ఛాన్స్‌ అందుకోవడం విశేషం. నాగ చైతన్యకి ఈ సినిమా కెరీర్‌ బెస్ట్‌ మూవీ కాగలదని నాగ్‌ నమ్మకం. ఆ నమ్మకంతోనే కోరి మరీ చైతూతో మరో ఛాన్స్‌ ఇచ్చి ఎంకరేజ్‌ చేశాడు. 'ప్రేమమ్‌', సాహసం శ్వాసగా సాగిపో' సినిమాల ద్వారా చైతూ రేస్‌లో దూకుడు మీదున్నాడు. ఈ సినిమాతో చైతూని మరో విజయం వరించనుందని అంటున్నారు. లక్కీ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. అన్నట్లు ఈ సినిమాకి రాకింగ్‌ మ్యూజిక్‌ మాస్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ అదరిపోయే మ్యూజిక్‌ అందించనున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam