Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

మెగా - విక్టరీ మల్టీ స్టారర్‌ ?

mega with victory

మెగాస్టార్‌ రీ ఎంట్రీలో 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో బాక్సాఫీసు రికార్డులు తిరగ రాశాడు. ఇప్పుడు చిరంజీవి హీరోగా 151వ సినిమా తెరకెక్కుతోంది. 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం చారిత్రాత్మక కథ. తొలి స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి. ఆయన జీవిత చరిత్ర కథాంశంగానే ఈ సినిమా రూపొందుతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీకాంత్‌ నటిస్తున్నారు. గతంలో 'శంకర్‌ దాదా ఎమ్‌బీబీఎస్‌', శంకర్‌దాదా జిందాబాద్‌' సినిమాల్లో 'ఎటీఎమ్‌' పాత్రలో శ్రీకాంత్‌ నటించాడు. ఆ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి రిజస్టర్ట్‌ క్యారెక్టర్‌ కోసమే ఈ సినిమాలో శ్రీకాంత్‌ని ఎంచుకున్నారట.

మరో పక్క స్టార్‌ హీరో గ్లామర్‌ కూడా ఈ సినిమాకి యాడ్‌ అవుతోందనీ సమాచారమ్‌. ఈ మధ్యే 'గురు' సినిమాతో వచ్చి తన పేరులో ఉన్న విక్టరీని సొంతం చేసుకున్నాడు విక్టరీ వెంకటేష్‌. ఇప్పుడు చిరుతో సినిమా చేయడానికి వెంకీ ముందుకొచ్చాడట. చిరంజీవి 150వ సినిమాలోనే వెంకీ నటించాలనుకున్నాడట కానీ కుదరలేదు. ఈ సారి ఈ సినిమాలో వెంకీ నటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వెంకీ ఈ సినిమా కోసం ఓ డిఫరెంట్‌ గెటప్‌ కూడా వేయబోతున్నాడనీ టాక్‌ వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే ఇదో పెద్ద మల్టీస్టారర్‌ సినిమా అవుతుంది. మల్టీస్టారర్‌ సినిమాలకి వెంకీ ఎప్పుడూ ముందుంటాడు. సూపర్‌ స్టార్‌ మహేష్‌తో వెంకీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో నటించాడు. ఇప్పుడు మెగాస్టార్‌తో. నువ్వు సూపర్‌ 'గురు'. 

మరిన్ని సినిమా కబుర్లు
prabhas double dhamaka