Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pava VS trivikram and two heroines

ఈ సంచికలో >> సినిమా >>

'జై లవ కుశ' చుట్టూ బోల్డన్ని కథలు

ntr new movie jai lavakusha

ఎన్టీయార్‌ కొత్త సినిమా టైటిల్‌ ఖరారయ్యింది. 'జై లవ కుశ' టైటిల్‌ని ఫైనల్‌ చేసేశారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేశారు. టైటిల్‌ లోగోనే ఫస్ట్‌ లుక్‌గా విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఎన్టీయార్‌ ఆర్ట్స్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీయార్‌ విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నాడు. మూడు డిఫరెంట్‌ గెటప్స్‌ అంటున్నారు. అందులో ఓ గెటప్‌ నెగెటివ్‌ షేడ్స్‌తో ఉంటుంది. దానికి సంబంధించిన మాస్క్‌ ఒకటి చిత్ర యూనిట్‌ బయటకు వదిలింది కొన్ని రోజుల ముందే. దాంతో ఎన్టీయార్‌ గెటప్‌ ఇలా ఉండవచ్చునంటూ స్కెచెస్‌ సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ గెటప్స్‌ కోసం హాలీవుడ్‌ నుండి టెక్నీషియన్స్‌ని తీసుకొచ్చారు.

ఇంకో వైపున 'జై లవ కుశ' మోషన్‌ పోస్టర్‌లో పది తలల రావణాసురుడ్ని చూపించడంతో అలాంటి పాత్రలో ఎన్టీయార్‌ని చూడవచ్చుననే ఊహాగానాలకు ఆస్కారం ఏర్పడింది. బాల నటుడిగానే ఎన్టీయార్‌ పౌరాణికంతో మెప్పించేశాడు. కానీ ఇది పౌరాణిక గాధ కాదు. అచ్చమైన కమర్షియల్‌ మూవీ. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. టైటిల్‌ వచ్చాక సినిమా చుట్టూ అనేక కథలు విన్పిస్తున్నాయి. ఎన్టీఆర్‌ 'జనతా గ్యారేజ్‌' సినిమా తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న మాట వాస్తవమే. అయితే టైటిల్‌ లోగో విడుదలయ్యాక ఇంతవరకూ సినిమాపై ఉన్న అంచనాలు మరింత రెట్టిపయ్యాయి. 

మరిన్ని సినిమా కబుర్లు
anjel was so attractive