Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
swami vivekananda biography sixth part

ఈ సంచికలో >> శీర్షికలు >>

సెన్సిటివ్ నెస్ - బన్ను

sensitiveness

"వాడు చాలా సెన్సిటివ్ రా! ఏదన్నా అంటే వెంటనే 'ఫీల్' అయిపోతాడు" అంటుంటారు. నిజానికి మనల్ని ఎవరన్నా ఏదన్నా అంటే ప్రతీ ఒక్కరూ 'ఫీల్' అవుతారు. కానీ కొందరు బయటపడతారు. కొందరు పడరు. అంతే తేడా!

నిజానికి నా దృష్టిలో 'సెన్సిటివ్ నేచర్' అంటే ఎవరికైనా దెబ్బతగిలినా, ఏదైనా దుర్ఘటన చూసినా భరించలేకపోవటం! కానీ మనం మన కోరిక నెరవేరక బాధపడటాన్ని, వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడటాన్ని, మన మొహం మీద ఎవరన్నా ఏదన్నా అంటే (మన తప్పయినా సరే... ) దిగాలు పడటాన్ని 'సెన్సిటివ్ నేచర్' అంటున్నాము. అది తప్పు!

కొంతమంది నేను చాలా సెన్సిటివ్ అని చెప్పుకుంటూ వుంటారు. కానీ అవతల వాళ్ళు కారా? సొంత విషయాలకి బాధపడుతూ అవతల వాళ్ళ విషయాలకి బాధపడకపోవటం 'సెన్సిటివ్ నేచర్' కాదు.

స్వంత విషయాలతో బాటూ, ఎవరి విషయమైనా సమానంగా స్పందించినప్పుడే సెన్సిటివ్ పెర్సన్ అవుతాడు!

మన కోరిక తీర్చుకున్నప్పుడొచ్చే ఆనందం కన్నా ప్రక్క వాళ్ళ కోరిక తీర్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లోని ఆనందం చూస్తే వచ్చే మహదానందం గొప్పది!

మీరొక రుచికరమైన వంటచేస్తే, దాన్ని పొగుడుతూ మీ ఇంట్లో వారో, బంధువులో, ఫ్రెండ్సో మీకు మిగల్చకుండా తినేసినా, మీ కడుపు నిండిపోతుంది. మీరప్పుడు పచ్చడి మెతుకులు తిన్నా మహదానందం కలుగుతుంది.

నన్ను మీరు నేను 'సెన్సిటివ్వా' అనడిగితే ఒక్కటే చెప్తాను. 'ONE SIDE I AM VERY SENSITIVE... BUT OTHER SIDE I AM VERY HARD' అని!

మరిన్ని శీర్షికలు
anathagiri hills - tourism