Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aaditya hrudayam - vn adithya

ఈ సంచికలో >> సినిమా >>

తనికెళ్ళ భరణి ‘నలుపు తెలుపు కొంచెం కలర్ ’

thanikella bharani - nalupu thelupu konchem color

ప్రముఖ సినీ నటుడు తనికెళ్ళ భరణికి సినీ పరిశ్రమలోని వివిధ విభాగాలపై అవగాహన వుంది. దర్శకుడిగా షార్ట్ ఫిలింస్ తెరకెక్కిస్తూ, విమర్శకుల నుండి ప్రశంసలు ఎన్నో అందుకున్నారాయన. సమాజం పట్ల అవగాహన, ప్రజల్ని చైతన్య పర్చాలనే సదుద్దేశ్యం. . ఇవన్నీ తనికెళ్ళ భరణిలో కన్పిస్తాయి.

సినీ పరిశ్రమలో వివిధ రకాలైన పాత్రల్లో కన్పించిన తనికెళ్ళ భరణి, తన ఆటో బయోగ్రఫీ రాసుకుంటున్నారు. ‘నలుపు తెలుపు కొంచెం కలర్ ’ అనేది ఆ ఆటోబయోగ్రఫీ టైటిల్ . తన ఆలోచనల్లాగానే, తన ఆటోబయోగ్రఫీకి కూడా వెరైటీ పేరు పెట్టుకున్న తనికెళ్ళ భరణి, ఆటో బయోగ్రఫీలో ఎలాంటి అంశాలను పొందు పర్చుతారోగానీ, ఆటోబయోగ్రఫీ అంటేనే వివాదాల పుట్ట అనే అభిప్రాయాలున్నాయి అందరిలోనూ.

అందుకు కారణం, గతంలో వచ్చిన చాలా ఆటోబయోగ్రఫీలు వివాదాస్పదమవడమే. తనికెళ్ళ భరణి, అలాంటి వివాదాలకు తావివ్వకుండా, సినీ పరిశ్రమలో తాను చూసిన, తెలుసుకున్న అంశాలను ప్రస్తావిస్తారని సినీ పరిశ్రమలో అందరూ అనుకుంటున్నారు. ఔను, సినీ పరిశ్రమలో ఆయన అజాత శతృవుగా పేరొందారు మరి.

మరిన్ని సినిమా కబుర్లు
madhura sreedhar with four movies in hand