Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
thanikella bharani - nalupu thelupu konchem color

ఈ సంచికలో >> సినిమా >>

నాలుగు సినిమాల మధుర శ్రీధర్

madhura sreedhar with four movies in hand

‘స్నేహగీతం’, ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’, ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ’ వంటి యూత్ ఫుల్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు మధుర శ్రీధర్ చేతిలో నాలుగు సినిమాలున్నాయిప్పుడు. ఇవన్నీ సెట్స్ పైకి రావాల్సి వుంది.

కెరీర్ లో గొప్ప కమర్షియల్ విజయాలు సాధించకపోయినా, సినిమాని ఖచ్చితమైన ప్లానింగ్ తో తెరకెక్కించడం, యూత్ ని ఆకట్టుకునే సినిమాలు తీయడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు మధుర శ్రీధర్ . ఆయన చేయనున్న సినిమాల్లో ‘దానకర్ణ’, ‘మాయ’ సినిమాలున్నాయి.

ఈ రెండు సినిమాలకు సంబంధించి నటీ నటుల ఎంపికలో బిజీగా వున్నారు మధుర శ్రీధర్ . మరో రెండు సినిమాలు ఇంకా చర్చల దశలో వున్నట్లు వినికిడి. సినిమాని తెరకెక్కించడంతోపాటు, దాన్ని ప్రమోట్ చేయడంలో ఎక్కువ శ్రద్ధ తీసుకునే మధుర శ్రీధర్ , తన దర్శకత్వంలో రానున్న నాలుగు సినిమాలతో ఎలాంటి విజయాలు నమోదు చేస్తారో.

మరిన్ని సినిమా కబుర్లు
nude actress tensions