Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nude actress tensions

ఈ సంచికలో >> సినిమా >>

‘శ్రీరామరాజ్యం’ తర్వాత ‘బాహుబలి’

bahubali after srirama rajyam

పాటల రచయిత జొన్నవిత్తుల కలం నుంచి అద్భుతమైన పాటలే వచ్చాయి, వస్తూనే వున్నాయి. పౌరాణిక పాటలంటే ఇప్పుడు జొన్నవిత్తుల వైపే చూస్తారందరూ. ‘శ్రీరామరాజ్యం’ పాటలు ఆయన కలం పదునుకు నిదర్శనం. అలాగని కమర్షియల్ పాటలు రాయరా? అంటే, రాయకేం, వాటితోనూ సత్తా చాటుకోగల వ్యక్తి జొన్నవిత్తుల.

‘విక్రమార్కుడు’ సినిమాలోని ‘కాలేజి పాపల బస్సు. . ’ అంటూ సాగే హుషారైన పాట జొన్నవిత్తుల రాసిందే. ఆ పాటలో ఆయన తనదైన చమత్కారం చూపించారు. ఆ పాట ఎంత పాపులరో అందరికీ తెలుసు కదా. ప్రస్తుతం జొన్నవిత్తుల ‘బాహుబలి’ సినిమా కోసం పాటలు రాస్తున్నారు.

సంగీత దర్శకుడు కీరవాణికి, జొన్నవిత్తుల అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానంతోనే ‘బాహుబలి’కి పాట రాయమని కోరడమే తరువాయి, జొన్నవిత్తుల తన కలానికి పదును పెట్టారు. తెలుగు సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా వస్తున్న ‘బాహుబలి’ సినిమాకి జొన్నవిత్తుల పాటలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
earnings by comedy