Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
earnings by comedy

ఈ సంచికలో >> సినిమా >>

అది నావల్ల కాదన్న హన్సిక

I can't do that - Hansika

‘బిగ్ బాస్ ’ రియాల్టీ షోలో ఛాన్స్ అంటే, సినిమా ఛాన్సులకన్నా గొప్ప అన్నంత పేరు పడిరది ఆ షోకి. అందులో హన్సికా మోత్వానీ కన్పించబోతోందని వార్తలొచ్చాయి. తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా వున్న హన్సికకి, బిగ్ బాస్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసేంత తీరిక వుందా? అని అందరూ అనుకున్నారు.

దీనిపై హన్సికని సంప్రదిస్తే, అదేం లేదని చెప్పింది. ‘బిగ్ బాస్’ రియాల్టీ షో విషయమై తనను ఎవరూ సంప్రదించలేదన్న హన్సిక, సినిమాలతో బిజీగా వున్నాననీ, ఒకవేళ ఎవరైనా ఆ రియాల్టీ కోసం సంప్రదించినా చేయలేనని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది హన్సిక.

బాలీవుడ్ నుంచే దక్షిణాది సినిమాల్లోకొచ్చిన హన్సిక, బిగ్ బాస్ షో అంటే తనకూ ఇష్టమని అంటోంది. తెలుగు, తమిళ భాషల్లో మొత్తం ఏడెనిమిది సినిమాలదాకా ఆమె చేతిలో వున్నాయి. ఇన్ని సినిమాలు పెట్టుకుని, బిగ్ బాస్ షోలో హన్సిక ఎందుకు కన్పిస్తుంది?

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam