Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

'స్పైడర్‌' సూపర్‌ స్టార్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌

spider super star latest sensation

చేస్తున్న ప్రయోగాత్మక సినిమాల్లో కొన్ని అంచనాల్ని అందుకోలేకపోతున్నా, సూపర్‌ స్టార్‌ మహేష్‌ ప్రయోగాలకు మాత్రం వెనుకాడడంలేదు. విలక్షణ చిత్రాల్ని ఎంచుకోవడంలో తనతదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడీ టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌. ఈసారి ప్రయోగం తెలుగు, తమిళ భాషల్లో చేస్తుండడం గమనించదగ్గది. మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా నటిస్తున్న 'స్పైడర్‌' సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ వచ్చాయి. స్టిల్స్‌లో మహేష్‌ సూపర్‌ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. అయితే మోషన్‌ పోస్టర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ విన్నవారికి, ఆ వీడియో మొత్తం జాగ్రత్తగా పరిశీలించినవారికీ ఇది హాలీవుడ్‌ స్థాయి 'మేకింగ్‌' అని అవగతమవుతుంది.

మహేష్‌ ఇంతకు ముందు కూడా టెక్నికల్‌గా అత్యున్నతంగా ఉండే సినిమాలు చేశాడు. అందులో '1 నేనొక్కడినే' సినిమా ఒకటి. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ కూడా టెక్నికల్‌గా ఆ సినిమాని ఇప్పటికీ ఇష్టపడేవారున్నారు. 'స్పైడర్‌' సినిమా దగ్గరకొస్తే, ఇది మురుగదాస్‌ సినిమా. విలక్షణ చిత్రాలకు మురుగదాస్‌ పెట్టింది పేరు. చూడ్డానికి మనిషి హైట్‌ తక్కువలా కనిపిస్తాడుగానీ, టాలెంట్‌ పరంగా చూస్తే మనోడు సూపర్‌ జీనియస్‌ అని చెప్పక తప్పదు. అతను తీసే సినిమాలు అలా ఉంటాయి. ఎన్‌విఆర్‌ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మహేష్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌జె సూర్య విలన్‌గా నటిస్తుండడం ఇంకో విశేషంగా చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ 'స్పైడర్‌' సూపర్‌ స్టార్‌ మహేష్‌ నుంచి వస్తోన్న మరో సెన్సేషన్‌గా భావించవచ్చు. 

మరిన్ని సినిమా కబుర్లు
bhali bhaliraa.. bahubali sahore bahubali