Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
First single of Fashion designer movie

ఈ సంచికలో >> సినిమా >>

చైతూ ఆ రేంజ్‌ హిట్‌ కొట్టేస్తాడట

chaitu will rwach to hit

నాగార్జున హీరోగా నటించిన చిత్రాల్లో 'నిన్నేపెళ్ళాడతా' చిత్రాన్ని కూడా ఓ మాస్టర్‌ పీస్‌లానే భావించాలి. అంత పెద్ద విజయం సాధించింది ఆ చిత్రం. రొమాంటిక్‌ ప్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'నిన్నేపెళ్ళాడతా' తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ సినిమాలో లవ్‌ ఉంటుంది, రొమాన్స్‌ ఉంటుంది, సెంటిమెంట్‌ ఉంటుంది, ఇంకా చాలా చాలా అందులో కనిపిస్తాయి. అందుకే అంత పెద్ద విజయాన్ని ఆ చిత్రం అందుకుంది. ఆ స్థాయిలో నాగచైతన్యకు 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమా హిట్‌ ఇస్తుందని దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ అంటున్నాడు. నాగచైతన్య, కళ్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమా మే 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

నాగార్జునతో 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాన్ని రూపొందించి హిట్‌ కొట్టిన కళ్యాణ్‌కృష్ణ, నాగచైతన్యతో చేస్తున్న 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాతో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకుంటాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సీనియర్‌ నటుడు జగపతిబాబు ఓ ముఖ్య పాత్రలో పోషించడం ఈ సినిమా హైలైట్స్‌లో మరో ముఖ్యమైన అంశంగా దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ వేసవిలో కూల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని, నాగచైతన్యకి సూపర్‌ హిట్‌ దక్కుతుందని ఆశిద్దాం. 

మరిన్ని సినిమా కబుర్లు
gopichand is  great