Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
gopichand is  great

ఈ సంచికలో >> సినిమా >>

మెగా ప్రిన్స్‌ మహా మాటకారే!

mega prince so talketive person

చూడ్డానికి చాలా కూల్‌ అండ్‌ కామ్‌గా కనిపిస్తాడుగానీ కుర్రాడి ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. వేగంగా ఉండటమే కాదు, కుర్రాడి మాటల్లోనూ లాజిక్‌ కనిపిస్తుంటుంది. అదే మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ ప్రత్యేకత. మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడైన వరుణ్‌ తేజ, 'ముకుంద' సినిమాతో తెరంగేట్రం చేశాడు. 'కంచె' సినిమాతోనూ మెప్పించాడు. అయితే 'లోఫర్‌' సినిమాతో కొంచెం నిరాశపరిచాడు. అయితే 'లోఫర్‌' సినిమాని వరుణ్‌ చాలా ఎంజాయ్‌ చేశాడట. తనలోని కొత్త కోణం ఆ చిత్రం ఆవిష్కరించిందంటాడు ఈ యంగ్‌ హీరో. ఫలానా సినిమా ఫ్లాపయ్యిందంటే, అనవసరంగా ఆ సినిమా చేశాననే భావన కొందరిలో ఉంటుంది.

వరుణ్‌ అందుకు భిన్నం. ప్రతి సినిమా ఓ పాఠం నేర్పుతుందంటాడు. అదే అతని ప్రత్యేకత. అభిమానుల విషయంలోనూ వరుణ్‌ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. కేవలం అభిమానులు చూస్తేనే సినిమాలు విజయవంతమవబోవనీ, అభిమానులు తమలో కొత్త ఉత్సాహాన్ని నింపుతారనీ, వారిని అలరించేందుకు కొత్త తరహా సినిమాలు ఎంచుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉంటుందని 'అభిమానుల్ని నొప్పించకుండానే తన అభిప్రాయాన్ని' చెప్పాడు. అభిమానులు ఇచ్చే బిరుదుల్ని కాదనలేమని అంటూనే ఆ బిరుదులు కొత్త బరువులా భావిస్తానని చెప్పాడు. ఆ స్వీట్‌ బరువు మోయగలిగిందేనని, అయితే ఇంకా తాను సాధించాల్సింది చాలా ఉన్నందున అప్పుడే బిరుదులు కొంచెం కష్టమేనని వివరించాడు. ఏదేమైనప్పటికీ మెగా ప్రిన్స్‌ మహా మాటకారే సుమండీ. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam