Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

మీ సెల్ఫీ మీ ఇష్టం: కండిషన్స్‌ అప్లయ్‌

your selfi your wish

నా చేతిలో ఫోనుంది, నాకు నచ్చినట్లు సెల్ఫీ తీసుకుంటానంటే కాదనేవారెవరు? కానీ ఆ సెల్ఫీనే ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టాలనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. జస్ట్‌ ఫర్‌ ఫన్‌ అంటూ ఎడా పెడా సెల్ఫీలు తీసేసి, గంటకోసారి వాటిని ప్రొఫైల్‌ పిక్స్‌లా పెట్టేసుకుంటోంది నేటి యువతరం. ఈ సెల్ఫీ సరదా యువతరానికి కాస్త ఎక్కువ అంతే. చేతిలో సెల్ఫీ తీసుకునే అవకాశమున్న మొబైల్‌ ఉన్నవాళ్ళెవరూ సెల్ఫీ సరదాకి అతీతులు కాదు. అది జస్ట్‌ ఫర్‌ ఫన్‌ మాత్రమే కాదు, అంతకు మించి కూడా. ఎత్తయిన ప్రదేశాల్లోంచి కిందనున్న అద్భుతమైన సీన్స్‌ చూపించేందుకు, ప్రమాదకరమైన సన్నివేశాల్ని తమతోపాటు చిత్రీకరించేందుకు సెల్ఫీలను ఎక్కువమంది వినియోగిస్తున్నారు. ఇలాంటివాళ్ళ విషయంలో చాలా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెల్ఫీ మేనియా, ఎంతమంది ప్రాణాలు తీసేస్తున్నాసరే, ఈ పిచ్చి నుంచి మాత్రం బయటపడ్డంలేదు. ప్రమాదంతో సావాసం చేయడం అదో 'క్రేజీ' ఐడియా. అందుకే ఆ గమ్మత్తుపై సరదా అంతకంతకూ ఎక్కువవుతోంది. అయితే మీరు తీసే సెల్ఫీ మీ వ్యక్తిత్వాన్ని చెబుతుందంటున్నారు నిపుణులు. డోన్ట్‌ కేర్‌ నైజం ఎక్కువగా ఉన్నవారు ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీలను దిగడానికి ఇష్టపడతారట. చాలామంది సెల్ఫీ దిగేటప్పుడు, తాము అందంగా ఉంటామా? లేదా? అనే సంశయంతోనే ఫొటోలు దిగుతుంటారట. ఇది ఇంకా క్రేజీ థింగ్‌ కదా. 

ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఏంటంటే, సెల్ఫీ ఎలా ఉంది? అని ఇతరుల అభిప్రాయం తెలుసుకుని, బాగోలేదనే రెస్పాన్స్‌ అట్నుంచి వస్తే కుంగిపోయేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. సెల్ఫీ సరదా తెచ్చిన సరికొత్త వ్యాధిగా దీన్ని భావించాలి. సెల్ఫీ దిగడం, దాన్ని సోషల్‌ మీడియాలో పెట్టడం ఇప్పుడు ట్రెండింగ్‌ థింగ్‌ అయిపోయింది. ఒక్కసారి ఇంటర్నెట్‌లోకి ఫొటో వెళితే, ఇక అంతే సంగతులు. అది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూడకూడని వెబ్‌సైట్లలోకి ఒక్కోసారి అలాంటి ఫొటోలు వెళ్ళిపోవడం, ఆ కంటెంట్‌కి తగ్గట్టుగా సెల్ఫీ ఎక్స్‌ప్రెషన్స్‌ ఉండటంతో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. సెల్ఫీ తెచ్చే సమస్యలు ఇంకా ఇంకా చాలానే ఉన్నాయి చెప్పుకోడానికి. అంతా నెగెటివ్‌ అనుకుంటే పొరపాటే. కొన్ని సెల్ఫీ ఫొటోల్ని చూసినప్పుడు, ఇతరులు కూడా ప్లెజెంట్‌గా ఫీలవుతారట. అంటే, సెల్ఫీ తీసుకున్న వ్యక్తి ఎక్స్‌ప్రెషన్‌ వాళ్ళకి అంతగా నచ్చుతుందన్నమాట. వ్యక్తిత్వానికి మంచి మార్కులు పడినప్పుడు, తొందరగా ఫ్రెండ్స్‌ అయ్యేవారూ ఎక్కువగానే ఉంటారు. ఏదేమైనా సెల్ఫీ ఓ సరదా. దాన్ని సరదా సరదాగా ఎంజాయ్‌ చేసెయ్యాలి. కానీ, ప్రమాదకర ప్రాంతాల్లో మాత్రం సెల్ఫీని పూర్తిగా బ్యాన్‌ చేసెయ్యండి. గాడ్జెట్‌ ఏదయినాసరే, అది ప్రాణాల్ని హరించేదిగా ఉండకూడదు. సాంకేతిక విప్లవం మనిషి ప్రాణాలు తీసేయడమంటే, అసలు సాంకేతిక విప్లవం అన్న మాటకే అర్థం ఉండదు.

మరిన్ని యువతరం
help full centers