Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahaasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆయ్..మేం గోదారోళ్ళమండీ.. - నూజిళ్ళ శ్రీనివాస్

aay..memu godarollamandee

తెలుగుదనమంటే మొదట గుర్తొచ్చేది గలగల పారే గోదారమ్మ పరవళ్ళే..... స్వచ్చమైన నీటి ప్రవాహంతో సాగిపోయే గోదారి వెంబడి అలా అలా సాగిపోతూ ఆ ప్రకృతి అందం చూస్తూంటే తనివి తీరదు... ఆ ఆనందం అనుభవిస్తే తప్ప మాటల్లో వ్యక్తం చేయడం సాధ్యం కాదు... గోదారమ్మ చల్లని నీళ్ళు తాగి పెరిగినందుకేమో ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళ మనసుల్లో ఆ స్వచ్చత... మాటల్లో మమత... ఆయ్.... అంతే కాదండోయ్... గోదారోళ్ళంటే ఇంకా చాలా ఉందండోయ్.... మమకారమొక్కటే కాదండోయ్... ఈళ్ళకి ఎటకారమూ ఎక్కువే.... అంతేనా అంటే అంతే కాదండీ... ఈళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉందండీ..... అవేమిటో తెలుసుకోవాలంటే ఈమధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోన్న ఈ పాట తప్పక విని ఆనందించాల్సిందే...... గోదారోళ్ళ గొప్ప ప్రతివాళ్ళ చెవుల్లోనూ పడి, అందరి నోళ్ళల్లోనూ నానుతోన్న ఈ పాట ప్రత్యేకత మరొకటుంది... అది మరేమిటో కాదు..... మన గోతెలుగు కి అనేకమైన చక్కటి కథలు రాసి పాఠకులనలరించిన శ్రీ నూజిళ్ళ శ్రీనివాస్ గారి కలం నుండి వెలువడిందే ఆ పాట. ఇలాంటి మరెన్నో మంచి మంచి పాటలు శ్రీ నూజిళ్ళ శ్రీనివాస్ గారి కలం నుండి వెలువడాలనీ, మంచి మంచి కథలు గోతెలుగులో వెలువడి పాఠకులను అలరించాలనీ కోరుకుంటూ..... వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం.... 

 

ఆయ్..మేము గోదారోళ్ళమండీ......!

రచన: నూజిళ్ళ శ్రీనివాస్, ఆంగ్లోపన్యాసకులు, ఆర్ట్స్ కళాశాల, రాజమహేంద్రవరం

 

పల్లవి:
ఆయ్..మేము గోదారోళ్ళమండీ......!
ఆయ్..మేము గోదారోళ్ళమండీ......!
మా మడుసులు మిన్నండి...    
మా మనసులు ఎన్నండి....
ఉప్పు, కారం మాట ఏమో గాని,
ఎటకారం మాకు ఎంతో రుసండి..!

చరణం-1:
పెద్దలంటే మరియాదండీ – మాకు
పేద- గొప్ప బేదం లేదండి..
కులము, గోత్రం మాట ఎట్టున్నా.. మాకు
ఊరంత సుట్టాలేనండి../ ఊరంతా వరసలేనండి
అబిమానం మా ఇంటిపేరండి.........2
ఆతిథ్యం మా ఆరో పేనమండి.........ఆయ్...

చరణం-2:
దేవతలకిది నెలవండి.. గొప్ప/ దేవుళ్ళందరికి నెలవండి.. గొప్ప
వేద పండితుల కొలువండి .....
పండగలు, పబ్బాలంటే – అబ్బ
సెప్పలేని సందడేనండి..
మేజువాణి మేళం మాకు మోజండి....2
కోడిపందాలంటే శాన ఇష్టమండి...ఆయ్....

చరణం-3:
పూతరేకు రుసి మాదండి – మడత,
గొట్టం – కాజాలూ మావండి
ఖైరతబాదూ గణపయ్యా- మెచ్చే
లడ్డు కూడా మాదేనండి
తిండి పెట్టి మమ్ము సంపేత్తారంటూ-2
తిన్నోళ్ళు సరదాగ అంటుంటరండీ....ఆయ్

చరణం-4:
అన్నదాతలం మేమండీ –సాఫ్టు
వేరు వీరులం మేమండి
అంబాజీపేట నుంచీ - అమెరిక
దేశందాక మేమేనండి..
ఫేసు బుక్కైనా – ఫేసు టు ఫేసయిన-2
మాతో మాటలంటే మంచిగుంటదండీ... ఆయ్

చరణం-5:
సినిమాలంటే మహా పిచ్చండి – కాని
సంప్రదాయాలకు రిచ్చండి
బాస లోన కొంత యాసున్నా – మాట
తేనెలూరుతుంటాదండీ
గోదారమ్మ నీళ్ళ సలవతో -2
ఎదిగిన కొద్దీ ఒదిగుంటమండీ...ఆయ్

మరిన్ని శీర్షికలు
Raw Mango Pickle