Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
spider first look sensation

ఈ సంచికలో >> సినిమా >>

శృతి, సమంత తిప్పేస్తున్నారోచ్‌

samanta, sruti trend change

అందాల భామలు ట్రెండ్‌ మార్చారు. పోరాట సన్నివేశాలపై ఫోకస్‌ పెట్టారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో నటించడం మామూలే. ఆ యాక్షన్‌లోనూ ప్రత్యేకత చూపించాలని తహతహలాడేవారు కొందరే ఉంటారు. 'బాహుబలి' సినిమా కోసం తమన్నా, అనుష్క కత్తిపట్టారు. అయితే శృతిహాసన్‌ కూడా ఓ సినిమా కోసం కత్తి పట్టింది. అది తమిళ సినిమా. సుందర్‌ సి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. 'సంఘమిత్ర' పేరుతో సుందర్‌ తెరకెక్కిస్తున్న సినిమా కోసం కత్తి యుద్ధాల్ని ప్రాక్టీస్‌ చేస్తోంది శృతిహాసన్‌. ఇంకో వైపున సమంత, కర్రని గిరగిరా తిప్పేస్తోంది. తెలుగులో దీన్ని కర్రసాము అంటాం. ఇదే తమిళంలో 'సిలంబం' అనే పేరుతో ప్రాచుర్యంలో ఉంది.

ప్రాచీన క్రీడల్లో ఇది కూడా ఒకటి. కత్తి పట్టడం ఎంత కష్టమో, కర్రసాము కూడా అంతే కష్టం. సమంత, చేతిలోని కర్రని గిరగిరా తిప్పేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది. అందాల భామలిలా కర్ర సాము చేస్తూ, కత్తి ఫైటింగులు చేసేస్తోంటే కుర్రకారు గుండెలు కోతకి గురికాకుండా ఉంటాయా? ఏం చేసినా, కొత్తదనం కోసమేనంటున్నారు అందాల భామలు శృతిహాసన్‌, సమంత. కెరీర్‌లో విలక్షణ పాత్రలు ఎంచుకోవడమే కాదు, సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేననే సంకేతాలు పంపుతున్నారు తమ చర్యలద్వారా నేటితరం అందాల భామలు. 
 

మరిన్ని సినిమా కబుర్లు
fashion designer C/o godavari