Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
fashion designer C/o godavari

ఈ సంచికలో >> సినిమా >>

రాజమౌళి ఇకపై ఏం చేస్తాడు?

rajamouli next option?

'బాహుబలి ది కంక్లూజన్‌' లాస్ట్‌ వర్కింగ్‌ డే కూడా పూర్తయిపోయింది. సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. తన లాస్ట్‌ వర్కింగ్‌ డే గురించి రాజమౌళి భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. ఏ సినిమాని అయినా ఏ దర్శకుడు అయినా ప్రేమించే చేస్తాడు. రాజమౌళి ఓ యజ్ఞంలా 'బాహుబలి'ని పూర్తి చేశాడు. ఒకే సినిమా, రెండు పార్టులుగా తీశాడు. మొదటి పార్ట్‌ 'బాహుబలి ది బిగినింగ్‌' అంచనాల్ని మించి విజయాన్ని సాధిస్తే, 'బాహుబలి ది కంక్లూజన్‌'పై అంచనాలకు ఆకాశమే హద్దు అయ్యింది.

ఒక్క సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు, ప్రపంచ వ్యాప్త గుర్తింపు సంపాదించుకున్నాడు రాజమౌళి. ఓ సినిమా కోసం ఇన్నేళ్ళు ఓ దర్శకుడు కష్టపడ్డాడంటే చిన్న విషయం కాదు. వేసిన ప్రతి సెట్‌, పనిచేసిన ప్రతి నటీ, నటుడు, సహచర టెక్నీషియన్లు.. ఇలా ఎన్నో అనుబంధాలు. వాటన్నిటినుంచీ ఇప్పుడు దూరంగా జరిగిపోవడమంటే ఆ బాధ వర్ణించరానిది. ఇంకో వైపున రాజమౌళి తదుపరి సినిమా ఏంటన్న చర్చ జరుగుతోందిప్పుడు. అయితే రాజమౌళి ఇంతవరకు తదుపరి సినిమా గురించిన ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే మహాభారతాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మహాభారతాన్ని తెరకెక్కించేందుకు ఇంకో వైపున సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మోహన్‌లాల్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దాంతో రాజమౌళి నెక్స్‌ట్‌ ఆప్షన్‌ ఏంటి? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకడంలేదు.

మరిన్ని సినిమా కబుర్లు
Fashion Designer s/o Ladies Tailer movie second song released