Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
carrot recipes

ఈ సంచికలో >> శీర్షికలు >>

బహుముఖ ప్రఙ్ఞాశాలి - భగవాన్ శ్రీ సత్యసాయిబాబా - ఆదూరి హైమవతి.

sri satya sai baba information

అలాగే ' అహంకు- అహంకారానికీ తేడా ఏమిస్వామీ? " అని ఆవిద్యార్ధి  అడగ్గానే ,స్వామి" అహంకు ఆకారాన్ని ఇచ్చి నట్లైతే  అహంకారం అవుతుంది."అని చెప్పారు.  ఇది సమాన్యులకు తట్టదు కదా! .ఇలాంటివి కోకొల్లలు.స్వామి వారు చెపుతూ ఉంటారు.

భగవాన్  బాబావారు ఒక గొప్ప సర్జన్ కూడా. అంటే శస్త్రవైద్య నిపుణులు..1960 ప్రాంతంలో స్వామి వారు కొంతమంది డాక్టర్లను  ఆపరేషన్ ధియేటర్ కు  ప్రత్యేకంగా తీసుకువెళ్ళారు. వారి నందరినీ రోగిచుట్టూ నిలబడమన్నారు.కొంతమంది సర్జన్ల పేర్లను పిలిచి ,”ఒక గాస్ట్రో జెజునోస్టమీ చేయాలంటే మీకు ఎంతసేపు పడుతుంది?” అని అడిగారు స్వామి. అసలు గాస్ట్రో జెజునోస్ట్రమీ.  అనే ఈమెడికల్  టర్మ్ స్వామి కి ఎలాతెలిసిందీ !' అనుకున్నారు డాక్టర్లంతా .

దానిని ‘పెప్టిక్ అల్సర్ ‘ అంటారు. వెంటనే స్వామికి తెలిసిన ఒక డాక్టర్ "సుమారు రెండుమూడు గంటలు పట్ట వచ్చు స్వామీ "అన్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు " ఇప్పుడు స్వామి అరగంటలో చేస్తారు. మీ రంతా చూస్తూ ఉండం డి " అని హస్తాన్నిత్రిప్పారు.ఒక చిన్నకత్తి వచ్చింది ,రోగి కడుపుకోసి ,తర్వాత ఆకత్తిని అదృశ్యం చేసినారు. వెంటనే ఒక కత్తెర ఇతర పరికరాలను ఒకటి తర్వాత ఒకటి సృష్టించి   ఆపరేషన్ ను అరగంటలో ముగించారు. అక్కడ ఉన్న డాక్టర్లు నిర్ఘాంత పోయారు.వారికి స్వామి మీద ఉన్నవిశ్వాసం మరింత దృఢ పర్చుకున్నారు.అందరు డాక్టర్లనూ ఆశీర్వదించారు . స్వామి వారు ఆపరేషన్  చేస్తూ ఉంటే అన్నిపరికరాలూ హస్తగతం అవుతాయి.
స్వామివారు ఒక నేత్ర ప్రదాత కూడా .డాక్టర్ అడీకే గారు భారత ప్రభుత్వం సూరత్ కల్ అనే ప్రదేశంలో ఒక ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ నిమిత్తమై వారిని నియమించింది. ఒక సారి ఆయన ప్రశాంతినిలయం వచ్చారు. స్వామివారు ఆయన ప్రార్ధన మీదట తాను కర్ణాటక రాష్టంలోని హుబ్లీ కి తప్పక వస్తానని మాట ఇచ్చారు. డాక్టర్ అడికే గారు ఎంతో ఆనంద పడ్దారు.స్వామివారు వచ్చే సమయానికి ఒక గొప్ప వైద్య ప్రాంగ ణం లో సభ ఏర్పాటు చే శారు.షుమారు పదివేలమంది హాజరైనారు. స్వామివారు రాగానే ప్రత్యేకంగా ఇద్దరు స్త్రీలు ఉన్న ప్రదేశానికి వచ్చారు. ఒక స్త్రీ నిలబడి దుఃఖ పడుతున్న ది. పక్కనే ఉన్న అమ్మాయి షుమారుగా 18సం. వయ సుంటుంది ,జపం చేసుకుంటున్నది.స్వామి పెద్దామెతో " మీ కూతురికి  నేత్ర దృష్టి ఇవ్వటానికే నేను ఇక్కడకు వచ్చాను. ఇంక ఏడవవద్దు. "అని “ ఈ అమ్మాయి నమశ్శివాయ నమశ్శివాయ అని మంత్రం జపిస్తూ ఉన్నది.నీవు ఆమెకు 5సం. వయస్సులో ఉన్నపుడే నేర్పిన అదే మంత్రం జపిస్తూ ఉన్నది.నిరంతరం జపించడం కారణంగా స్వామి ఆమెకు నేత్ర దృష్టిని ఇవ్వటానికే వచ్చారు. ఆమెకు ఇప్పుడు 18సం. పుట్టు అంధురాలు . అంటూ తన కుడిచేతి రెండు వేళ్లనూ ఆ అమ్మాయి కళ్ల మీద పెడుతూ నెమ్మదిగా రాశారు.అంతే ! ఆమెకు దృష్టి వచ్చేసింది.ఈ దృశ్యాన్ని ఒక ఫోటో గ్రాఫర్ కూడా క్లిక్ చేశాడు. అదీ స్వామివారి నేత్ర ప్రదాన ప్రఙ్ఞ. ఆతరు వాత స్వామి వారు ఒక అర్ధ గంట వరుసలో తిరుగుతూ అందరినీ ఆశీర్వదించారు. ఈవిధంగా స్వామివారు ఒక గొప్ప ధన్వంతరి కూడా.

ఇక ఉపన్యాసాలు ఇవ్వటంలో స్వామి వారికి స్వామే సాటి. గంటల తరబడీ ఉపన్యసిస్తూ ప్రేక్షకులను భక్తులనూ మంత్ర ముగ్ధులను చేయ గలరు. ఆధ్యాత్మిక రహస్యాలను , వేదార్ధాలను, అందరికీ అర్ధ మయ్యేలాగున తెలియ పరచగలరు . ఒక సారి ప్రముఖ వేదపండితుడు శ్రీమాన్ ఉప్పులూరి గణాపతి శాస్త్రిగారు స్వామిని ఇలా అడిగారు."స్వామీ! వేదంలో ఒకచోట ' రాక్షసులు విష్ణువును సమ్హ రించిరి’ అని ఉన్నది.అది ఎలాగా స్వామీ అనగానే  స్వామినవ్వి " విష్ణువు అనేది ఒక రాక్ష సుని పేరులే అన్నారు. కనుకనే ఒక పద్యంలో  ' కాల సందిగ్ధ  విగ్రహ దీప్తులై ఉండ భాష్యార్ధ గోప్యముల్ పలు కు కొరకు –‘- అనిస్వామే చెప్పుకున్నారు. అలాగే ఒకసారి హాస్టల్లో ఒక బలాఢ్యుడైన విద్యార్ధిని పిలిచి "ఒరే నాచేయి కదిలించరా!"అని టేబుల్ మీద స్వామి తన మోచేతిని ఉంచారు. ఆవిద్యార్ధి ప్రయత్నించాడు, ఐతే సాధ్యంకాలేదు.స్వామి తనచేతి తో ఆవిద్యా ర్ధి చేతిని గట్టిగా విదిలించారు . అతను క్రిందపడ్దాడు.అదీ స్వామి వారి బాహుబలం.
 చతురోక్తులలో స్వామి ప్రఙ్ఞాపాటవం  ఇంతా అంతా కాదు.ఒక ఇటలీ దేశపు వనితను ఉద్దేసింది "వేయ్ డిడ్ యూ కం ఫ్రం? "అని అడిగారు.ఆమె "ఫ్రం ఇటలీ!"అంటూ తమ పధ్ధతిలో 'ఇడ్లీ ' అన్నట్లుగా వ్యక్త పరచింది.స్వామి వెంటనే "ఇడ్లీ! Not ఫ్రం చట్నీ!" అని అడిగారు  .పక్కవారు నవ్వారు. ఐతే ఆమె ఆశ్చర్యం వ్యక్త పరుస్తూ "చట్నీ అనేది  తన పూర్వీకు లున్న ఒక ప్రదేశం అది స్వామికి ఎలాతెలుసా !’ అని అనుకుంది  . అందుకనే స్వామి సర్వఙ్ఞుడు అంటాం.

ఒక మారు హైదరాబాదు లో  Y.J Rao జియాలజీ  అనగా భూగర్భశాస్త్రం ప్రొఫెసర్ .స్వామి వారితో కార్లో వెళుతుండగా ,ఒకచోట కారు ఆపారు స్వామి. దారిలో పడి ఉన్న ఒకరాయిని తీసుకుని " ఇది ఏమీటీ ?" అనిస్వామి రావ్ గారిని అడి గారు." ఇది ఒక గ్రానైట్ రాయిస్వామీ "అన్నారాయన. స్వామి రావ్ గారితో " ఇంకాలోతుగా చూడూ!" అన్నారు.వెంటనే ఆ ప్రొఫెసర్ " ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ,న్యూట్రాన్స్ "స్వామీ!" అన్నారు.ఇంకాలోతుగచూస్తే "అంటూ స్వామి ఆగ్రానైట్ రాయి ని గట్టిగా ఊదారు. అంతే అది శ్రీకృష్ణ విగ్రహంగా మరిపోయింది. ఆశ్చర్య పోయాడా ప్రొఫెసర్. స్వామి ఆ విగ్రహంలో ఓ చిన్న ముక్కను విరిచి ఆ ప్రొఫెసర్ నోట్లో వేశారు. అది కలకండ ముక్క ఐంది. అందుకనే మధురాతి పతే రఖిలం మధురం  అన్నారు.  రాతిని నాతిగా  శ్రీరాముడు మార్చాడు ,రాతిని మధురాధిపతి గా  మార్చారు మన సత్యసాయి బాబా వారు . ఆరాముడేగా మనసాయి రాముడు  కూడా.

తర్వాత కధలు చెప్పడంలో అది మానవ జీవితానికి అన్వయించడం లో కూడా ప్రఙ్ఞను చూపుతారు. స్వామివారు ఒక కధ చెప్పారు .ఆకధ ఏమంటే  ఒకరాజుగారికి నలుగురు భార్య లున్నారు. మొదటి భార్యను సరిగా చూడడు. ఆమె ఊసెత్తడు కూడా. రెండవ భార్య ఇతనికి హితవు చెప్పేది. ఇది మంచిది ఇది చెడ్దది అని మాత్రం చెప్పేది.  మూడవ భార్య చాలా అందగత్తె. అందుకని తనను పార్టీలకు functions కూ తీసుకెళ్ళేవాడు. ఆమెచాలా అందంగా ఉండ టం వల్ల తన గౌరవం కూడా పెరిగేది. నాలుగో భార్య మీద మహాప్రేమ ఏనాడూ విడిచి ఉండేవాడు కాదు.ఇలా ఉండగా కొంత కాలానికి ఈ రాజు గారికి బ్రహ్మాండమైన జబ్బుచేసింది. ఇంక ఆశలు వదులుకున్నాడు. సరే నాల్గవ భార్యను అడి గాడు." నేను పోతున్నాను నాతో వస్తావా?" ఆమె " అసంభవం " అన్నది. నిర్ఘాంతపోయాడు. తాను అంతగా ప్రేమిం చేవాడు , ఇపుడు అసంభవము అనగానే చాలా బాధపడ్డాడు. మూడవ భార్యను అడిగాడు" నీవు నాతో వస్తా వా? " అన గానే ఆమె నేను నీవు పోగానే వెంటనే మంచి సంతాప సభను  ఏర్పాటూ చేస్తాను.మంచి  అన్నదానం చేస్తాను. ఐతే నీ వెంట మాత్రం రాలేను " అన్నది.

రెండవ భార్యతో 'నీవు నావెంట వస్తావా?" అంటే లేదు " నేను వెంటనే మరొకరిని వివాహంచే సుకుంటాను అంటుంది. ఇక మొదటి భార్యను అడుగు తాడు.ఆమె "నేను నీవెంటనే వస్తాను , నీవు నన్ను తల్చుకున్నా తల్చుకోకపోయినా  నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పుడు మన జీవితానికి అన్వయించుకుంటూ ఎవరు ఎవరు " అనిస్వామి అడిగారు.

మళ్ళీ స్వామే సమాధానం చెప్తారు.మొదటి  భార్య ఆత్మ. ఎప్పుడూ మనలను ప్రేమిస్తూనే ఉంటాడు.మనం తల్సుకున్నా తలచక పోయినా మనను  ప్రేమించేది ఆ పరమాత్మ ఒక్కడే. ఇక 2వ భార్య హితవు చెప్పేది, అనగా స్నేహితులు బంధు వులు . వారు మంచీ చెడూ చెప్తారు . మూడవభార్య మనం ధరించే నగలు , బట్టలుమొదలైనవి.మనం పోగానే బంధువు లు బిడ్డలు ఆనగలను తీసుకుంటారు. ఇప్పుడు నాల్గవభార్య దేహం మన వెంటరాదు. కనుక ఇలాంటి చిన్నకధలను స్వామి వందల కొలదీ చెప్పారు.కధ ఆకర్షణీయంగా ఉంటుంది.ఇదీ వారి ప్రఙ్ఞ.

మరిన్ని శీర్షికలు
Veg Pulao in Rice Cooker!