Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
director viswanath

ఈ సంచికలో >> సినిమా >>

'స్పైడర్‌' సాంకేతిక అద్భుతమట!

spider technical work  fantastic

మురుగదాస్‌ సినిమాలంటే టెక్నికల్‌గా హై రేంజ్‌లో ఉండడమే కాకుండా సమాజానికి ఏదో ఒక మంచి సందేశాన్నిచ్చేవిగా ఉంటాయన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. తాజాగా మహేష్‌ బాబు - మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కూడా అలాంటిదేనట. టెక్నికల్‌గా చాలా హైటెక్‌ హంగులతో ఈ సినిమా తెరకెక్కుతోందట. 'స్పైడర్‌' అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఇంతవరకు ఎక్కడా చూడని విధంగా ఉంటాయని సమాచారమ్‌. క్లాస్‌ టచ్‌తో కూడిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ అట. మురుగదాస్‌ చిత్రాల్లో సామాజిక కోణం చూపించే విధానం చాలా చక్కగా ఉంటుంది.

ఈ సినిమాలో కూడా అంతేనట. అందరకీ అర్ధమయ్యే రీతిలో సోషల్‌ మెసేజ్‌ ఇవ్వనున్నాడట ఈ సినిమా ద్వారా మురుగదాస్‌. త్వరలో టీజర్‌ విడుదల చేయనున్నారట. ముందుగా ఈ చిత్రాన్ని జూన్‌ 23న విడుదల చేయాలనుకున్నా, ఇప్పుడది ఆగస్ట్‌కి పోస్ట్‌ పోన్‌ అయినట్లుగా తెలియవస్తోంది. మహేష్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌ మూవీ ఇది. ఇదో బై లింగ్వల్‌ మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ డైరెక్టర్‌ ఎస్‌.జె.సూర్య ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. తమిళ్‌ యంగ్‌ హీరో భరత్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
DJ, duvvada jagannaadham is comming