Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
DJ, duvvada jagannaadham is comming

ఈ సంచికలో >> సినిమా >>

13 ఏళ్ళ తర్వాత నితిన్‌తో అర్జున్‌

nitin act with arjun

'శ్రీఆంజనేయం' సినిమా తర్వాత 13 ఏళ్ళకు మళ్ళీ నితిన్‌తో సీనియర్‌ నటుడు అర్జున్‌ కలిసి నటిస్తున్నాడు. 'శ్రీఆంజనేయం' సినిమాలో ఆంజనేయుడిగా అర్జున్‌ నటనని ఎప్పటికీ మర్చిపోలేం. ఆంజనేయుని పాత్రలో అర్జున్‌, అమాయకునిగా నితిన్‌.. వీరిద్దరి కాంబినేషన్‌ ఎంతో చక్కగా వర్కవుట్‌ అయ్యింది ఈ సినిమాలో. ఇంత కాలం తర్వాత మళ్ళీ ఆ కాంబినేషన్‌ ఇప్పుడు రిపీట్‌ అవుతోంది. లాస్‌ వేగాస్‌లో 'లై' టీమ్‌తో కలిసి వర్క్‌ చేస్తున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు

అర్జున్‌. 13 ఏళ్ళ తర్వాత అర్జున్‌తో కలిసి నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని నితిన్‌ చెప్పాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాకి 'లై' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది. మాస్‌ మసాలా యాక్షన్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో అర్జున్‌ ఏ పాత్రలో నటిస్తున్నాడన్నది ఇంకా సస్పెన్సే. అది విలన్‌ పాత్రనా? లేక సపోర్టింగ్‌ క్యారెక్టర్‌నా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కొత్త ముద్దుగుమ్మ మేఘా ఆకాష్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 'అ,ఆ..' సినిమాతో మంచి విజయాన్ని అందుకుని ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు నితిన్‌. అదే సక్సెస్‌ని ఈ సినిమాతో కొనసాగిస్తాడో లేదో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
sraddhakapoor act different roals