Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

రికార్డుల దుమ్ము దులిపేస్తున్న 'బాహుబలి'

bahubali breaking records

ఒక తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా 9000 థియేటర్లలో విడుదల కావడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి గొప్ప విషయం ది గ్రేట్‌ 'బాహుబలి' సినిమాతో సాధించింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఏకంగా ఈ 'బాహుబలి'ని హాలీవుడ్‌ సినిమాలతో పోల్చి చూస్తున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు 'బాహుబలి'కున్న క్రేజ్‌ ఎలాంటిదో. అందుకే ఇది అంతటా రికార్డులకు వేదికైంది. 'బాహుబలి' హిందీ వెర్షన్‌ను కరణ్‌ జోహార్‌ రిలీజ్‌ చేశారు. అక్కడ ఈ సినిమా సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇంతవరకూ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన 'దంగల్‌', సుల్తాన్‌' వంటి సినిమాల రికార్డులు 'బాహుబలి' సినిమాతో వెనక్కి వెనక్కి వెళ్లిపోయాయంటేనే నమ్మశక్యం కాకుండా ఉంది. ఇక టాలీవుడ్‌లో అయితే గత రికార్డులన్నీ కనుమరుగై పోయాయి. ఓవర్సీస్‌లోనూ కనీ వినీ ఎరుగని విజయం సాధించింది 'బాహుబలి' సినిమా. ఏకంగా హాలీవుడ్‌ చిత్రాలతో పోటీ పడ్డ 'బాహుబలి ది కంక్లూజన్‌'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

వీకెండ్‌ వసూళ్ళతో సరికొత్త రికార్డ్‌ సృష్టించింది ఈ సినిమా. సోమవారం కూడా అంతకు ముందు సెలవు దినమైన ఆదివారం వసూళ్ళతో పోటీ పడటం గమనించదగ్గ విషయం. 500 కోట్ల వసూళ్ళను టచ్‌ చేసేసిన 'బాహుబలి'. వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీసేస్తోంది. మొదటి వారం కంప్లీట్‌ అయ్యేసరికి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో ఊహించడమే కష్టంగా ఉంది. 

మరిన్ని సినిమా కబుర్లు
heavy budet for mega movie