Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bahubali breaking records

ఈ సంచికలో >> సినిమా >>

మెగా మూవీకి అంత బడ్జెట్టా?

heavy budet for mega movie

రీ ఎంట్రీలో వచ్చిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో రికార్డులు బద్దలు కొట్టేశాడు మెగాస్టార్‌ చిరంజీవి. బాస్‌ అంటే బాసే. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ వార్‌ ఈజ్‌ వన్‌ సైడ్‌ అన్నట్లుగానే బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేశాడు చిరంజీవి. ఆరు పదుల వయసులోనూ అదే జోష్‌, అదే గ్రేస్‌ మెయింటైన్‌ చేసి, యూత్‌కి మరింత ఇన్స్‌పిరేషన్‌గా నిలిచాడు.

మెగాస్టార్‌ తదుపరి చిత్రం చారిత్రక నేపధ్యంలో ఉండబోతుందన్న సంగతి తెలిసిందే. అదే 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'. చరిత్రలో కనుమరుగై పోయిన స్వాతంత్య్రోద్యమ నాయకుడు ఉయ్యాలవాడ. అలాంటి ఓ గొప్ప స్వాత్వంత్రోద్యమ నాయకుడి చరిత్రని అందరూ తెలుసుకుని తీరాల్సిందే. అందుకే ఈ సినిమాని చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కించాలని అంతా భావించారు. అంతేకాదు ఈ సినిమాని జాతీయ స్థాయిలో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. 'బాహుబలి' తెచ్చిన క్రేజ్‌తో తెలుగు సినిమా ఖ్యాతి జాతీయ స్థాయికెక్కేసింది. అందుకే ఆ వెంటనే చిరు సినిమా 'ఉయ్యాలవాడ' సినిమాని కూడా జాతీయ స్థాయి ప్రాజెక్టుగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. దాదాపు 175 కోట్ల బడ్జెట్‌ అని ప్రచారం సాగుతోంది. ఈ సినిమాని రామ్‌ చరణ్‌ నిర్మించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌లో సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరక్కెబోతోంది. ఆగష్టులో ఈ సినిమా సెట్స్‌ మీదకి వెళ్లనుందని ఈ సినిమా నిర్మాత రామ్‌ చరణ్‌ తెలిపారు. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక టీమ్‌ గత కొంత కాలంగా కసరత్తులు చేస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
prabhas in medam tussads