Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
heavy budet for mega movie

ఈ సంచికలో >> సినిమా >>

మేడమ్‌ టుస్సాడ్స్‌లో ప్రభాస్‌

prabhas in medam tussads

ప్రఖ్యాత మ్యూజియం మేడమ్‌ టుస్సాడ్స్‌లో ప్రభాస్‌ మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో మైనపు బొమ్మ ఏర్పాటు చేయడం అంటే చాలా అరుదైన పురస్కారమే. అతి కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఈ మ్యూజియంలో చోటు దక్కింది. సౌతిండియాకి చెందిన ఓ నటుడి మైనపు విగ్రహం ఇక్కడ ఏర్పాటు కావడం అనేది ఇదే తొలిసారి. బాలీవుడ్‌లో షారుక్‌, అమితాబ్‌ సహా పలువురు ప్రముఖుల విగ్రహాలున్నాయి మేడమ్‌ టుస్సాడ్స్‌లో. బ్యాంకాక్‌లో ప్రబాస్‌ మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు.

ఇటీవల విడుదలైన 'బాహుబలి' సినిమా ప్రబాస్‌కి తెచ్చి పెట్టిన అపురూపమైన గౌరవమే ఈ విగ్రహం ఏర్పాటు. 'బాహుబలి' సాధించిన విజయానికి దక్కిన అరుదైన గౌరవం. ఒక్క బాహుబలి - వంద సినిమాలతో సమానం అని పేర్కొనడం మరో విశేషం. అభిమానులు, తమ అభిమాన హీరో మైనపు బొమ్మను ఫొటోల్లో చూసి మురిసిపోతున్నారు. 'బాహుబలి' గెటప్‌లో ఉన్న ప్రబాస్‌ మైనపు బొమ్మ చాలా బాగుంది మరి. ఈ రికార్డ్‌ సాధించిన తొలి తెలుగు సినీ హీరో కావడం అభిమానులతో పాటు తెలుగు సినీ పరిశ్రమకు కూడా గర్వకారణంగా ఉంది. ఈ మ్యూజియం త్వరలో ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఇక్కడ తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారట.

మరిన్ని సినిమా కబుర్లు
viswaroopam  comming soon