Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prabhas in medam tussads

ఈ సంచికలో >> సినిమా >>

కమల్‌ హాసన్‌ నట 'విశ్వరూపం' చూస్తారా?

viswaroopam  comming soon

కమల్‌ హాసన్‌ నట విశ్వరూపం ఇప్పుడేమిటి అప్పుడెప్పుడో 'ఆకలి రాజ్యం' టైంలోనే చూపించేశాడు. ఆయన నటించిన 'స్వాతిముత్యం' సినిమాలో ఆయన నటన ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే ఆయన విశ్వ నటుడయ్యాడు. కేవలం ఆయన నటుడే కాదు దర్శక నిర్మాత కూడా. ఆయన నటిస్తూ నిర్మించిన చిత్రం 'విశ్వరూపం'. గతంలో ఈ సినిమాని నిర్మాణం జరిగేటప్పుడే చాలా వివాదాలను ఎదుర్కొన్నాడు ఆయన. తర్వాత ఆ సినిమా విడుదలకీ ఎన్నో రకాల వివాదాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్ధికంగా ఆ సినిమా విషయంలో ఆయన చాలా నష్టపోయారు. అయినా కానీ విడుదల తర్వాత ఆ సినిమా సెన్సేషనే అయ్యింది.

ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ 'విశ్వరూపం 2' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల ఎప్పుడో జరగాలి. వివాదాల కారణంగా ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం ఆయన 'శభాష్‌ నాయుడు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈలోగా అతి త్వరలోనే 'విశ్వరూపం 2' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే యోచనలో ఉన్నారట కమల్‌ హాసన్‌. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ విడుదల చేసి సోషల్‌ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆయన సినిమాలకు యూత్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ఆయన నటనలో ఏదో మ్యాజిక్‌ ఉంటుంది. ఆ మ్యాజిక్కే ఆయన్ని విశ్వనటుడిగా ప్రశంసించింది. 

మరిన్ని సినిమా కబుర్లు
Vamsy’s ‘Fashion Designer s/o Ladies Tailor’ releasing on June 2