Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

12-05-2017 నుండి 18-05-2017 వరకు వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తంమీద ఆరంభంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టకపోవడం సూచన. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. అనవసరమైన విషయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండుట మంచిది. ఉద్యోగంలో సమయపాలన పాటించుట ఉత్తమం. విలువైన వస్తువులను నస్టపోయే ఆస్కారం ఉంది, కొత్త వస్తువులను కొనుగోలు చేయకపోవడం సూచన. ఆర్థికపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ చూపిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు.

 

 

 వృషభ రాశి :  ఈ వారం మొత్తం మీద ఆలోచనలను పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చేపట్టు పనుల విషయంలో స్పష్టత ఉండుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలను కలిగి ఉంటారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, గతంలో ఉన్న పరిచయాల వలన లబ్దిని పొందుతారు. కుటుంబంలో అధికారుల నుండి కీలకమైన సహకారం లభిస్తుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఆశించిన మేర గుర్తింపును పొందుతారు.

 

.
మిథున రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. వారి నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు.  పెద్దలతో మీకున్న పరిచయం మీకు లబ్దిని కలిగిస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఒకింత ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. స్త్రీ పరమైన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. సాధ్యమైనంత వరకు చర్చలకు దూరంగా ఉండుట మేలుచేస్తుంది. అనుకోకుండా స్వల్పదూర ప్రయాణాలు చేయవల్సి వస్తుంది.

 


కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో పనిఒత్తిడి ఉండే అవకాశం ఉంది, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళుట సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశము ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. నూతన పనులను మొదలు పెట్టాలనే ఆలోచన కలిగి ఉంటారు. మీ ఆలోచన ధోరణి లేదా మాట్లాడే ధోరణి సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఉంది. గతంలో రావలిసిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు.



 సింహ రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల వలన పనిభారం పెరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట సూచన. మిత్రులనుండి ఆశించిన మేర సహాకారం వారం చివర లభిస్తుంది. మీ ఆలోచనల్లో మొండి తరం పెరుగుతుంది, కొంతమందికి మీ ఆలోచన ధోరణి నచ్చకపోవచ్చును. సంతానపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విలువైన వస్తువుల కోసం అధికంగా ధనం వెచ్చించే అవకాశం కలదు. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం ప్రయత్నం మొదలు పెడతారు.

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద వ్యాపారపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం కలదు. రావలసిన ధనం సమయానికి చేతికి అందుతుంది. నూతన పెట్టుబడుల కోసం చేయు ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలు పొందుతారు. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. పెద్దలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయకండి. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత వరకు చర్చా పరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన.

 


తులా రాశి : ఈవారం మొత్తం మీద మిశ్రమఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులను ఆలస్యంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుండి పనిఒత్తిడి ఉంటుంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, మీ ఆలోచనలను వారితో పంచుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకొనే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు.

 


వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద నూతన పనులను మొదలు పెట్టుటకు ఆసక్తిని చూపిస్తారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడే అవకాశం ఉంది. వారి అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళుట సూచన. వాహనాల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ కలిగి ఉన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేయుట సూచన. ఉద్యోగంలో చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. చక్కటి ప్రణాళిక కలిగి ఉండుట అన్నివిధాలా మంచిది. మిత్రులతో సమయం సరదాగా గడుపుతారు.


ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. పెద్దలనుండి వచ్చిన సూచనలను మరొకసారి ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సోదరులతో చేపట్టిన చర్చలు ఆశించిన మేర ఫలితాలను ఇవ్వకపోవచ్చును. కుటుంబ పరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలుతీసుకొనే అవకాశం ఉంది. సంతాన పరమైన విషయాల్లో కొద్దిగా ఒత్తిడిని ఎదుర్కొనే ఆస్కారం ఉంది. దూరప్రదేశంలో ఉన్న బంధువులను కలుసుకునే అవకాశం ఉంది.

 

మకర రాశి : ఈవారం మొత్తం మీద సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యం అయిన విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. గతంలో మొదలు పెట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. మిత్రులనుండి రావాల్సిన సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం కలదు. మీ మాటతీరు మూలాన కొంతమంది ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. చాలావరకు ముఖ్యమైన విషయాల్లో సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.

   

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద చాలావిషయాల్లో ఒత్తిడిని కలిగి ఉంటారు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. మానసిక పరమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అనుకోని ఖర్చుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆత్మీయులను కోల్పోవడం వలన ముందుముందు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు , జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.


మీన రాశి : ఈవారం మొత్తం మీద చర్చలకు దూరంగా ఉండుట సూచన. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. పెద్దలతో మీకున్న పరిచయం లబ్దిని పొందేలా చేస్తుంది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. బంధువుల నుండి వచ్చు సూచనలను ఒకటికి  ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది.

మరిన్ని శీర్షికలు
lemon chicken