Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

రాధ చిత్ర సమీక్ష

radha movie review

చిత్రం: రాధ 
తారాగణం: శర్వానంద్‌, లావణ్య త్రిపాఠి, అక్ష, జయప్రకాష్‌రెడ్డి, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మాజీ, షకలక శంకర్‌, అలీ, సప్తగిరి, రవికిషన్‌ తదితరులు. 
సంగీతం: రదన్‌ 
సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని 
దర్శకత్వం: చంద్రమోహన్‌ 
నిర్మాత: భోగవల్లి బాపినీడు 
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర 
విడుదల తేదీ: 12 మే 2017 

క్లుప్తంగా చెప్పాలంటే 
పెద్దయ్యాక పోలీస్‌ ఉద్యోగం చేయాలని చిన్నప్పటినుంచే కలల కన్న రాధాకృష్ణ (శర్వానంద్‌), పోలీస్‌ ఉద్యోగం వచ్చేలోపే పోలీస్‌ చెయ్యాల్సిన పనలు చేసేస్తుంటాడు. అలా అతను చేసే కొన్ని పనులు సాక్షాత్తూ డీజీపీకి నచ్చేయడంతో పోలీస్‌ ఉద్యోగం తొందరగా వచ్చేస్తుంది. పోలీస్‌ డ్రెస్‌ రాగానే దుష్ట శిక్షణలో చెలరేగిపోవాలని నిర్ణయించుకుంటాడుగానీ, పెద్దగా గొడవల్లేని ప్రాంతంలో పోస్టింగ్‌ వస్తుంది రాధాకృష్ణకి. అక్కడ అతనికి రాధ (లావణ్య త్రిపాఠి)తో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఈలోగా హైదరాబాద్‌కి మనోడ్ని బదిలీ చేస్తారు. అక్కడే రాధాకృష్ణకి అసలు పని తగులుతుంది. సాక్షాత్తూ హోమ్‌ మినిస్టర్‌ (రవికిషన్‌)తో సమస్య వచ్చిపడుతుంది. అదేంటి? దాన్ని రాధాకృష్ణ ఎలా టాకిల్‌ చేశాడు? రాధాకృష్ణ మనసుపడ్డ రాధని పెళ్ళాడాడా? లేదా? ఇవన్నీ తెరపైనే చూడాలి. 

మొత్తంగా చెప్పాలంటే 
ఇలాంటి కథల్ని తెలుగు తెరపై చాలానే చూసేశాం. అయితే ఇందులో శర్వానంద్‌ పాత్ర కొత్తగా అనిపిస్తుంది. అతన్నిలా చూడటం ఇదే మొదటిసారి కావడంతో కొత్తగా ఎట్రాక్ట్‌ చేస్తాడు. మంచి నటుడు కావడంతో అంతకు మించిన ఈజ్‌తో చెలరేగిపోయాడు. రాధాకృష్ణ లీలల్ని చూస్తూ మాంఛి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీలవుతాం. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి నేచురల్‌ బ్యూటీ. ఆమె అందాన్ని ఇంకా అందంగా చూపించారు. నటన పరంగా ఓకే అనిపిస్తుంది. మంచి నటి అయినప్పటికీ ఆమెకు నటన పరంగా బలమైన సన్నివేశాలేమీ లేవు. మిగతా పాత్రల్లో అక్ష ఓ పాటకే పరిమితం కాగా, మిగిలినవారంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 

కథ పరంగా ఓకే అనిపిస్తుంది. కథనమూ అంతే. డైలాగ్స్‌ బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. సినిమటోగ్రఫీ చాలా చాలా బాగుంది. ఎడిటింగ్‌ సెకెండాఫ్‌లో కొంచెం అవసరం అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి బాగా హెల్ప్‌ అయ్యాయి. 

దర్శకుడు పూర్తిగా శర్వానంద్‌ని సరదా సరదాగా సాగిపోయే పోలీస్‌ క్యారెక్టర్‌లో బాగా ప్రెజెంట్‌ చేయడమ్మీదనే దృష్టిపెట్టాడు. దాంతో కథ, కథనం సోసోగా అనిపిస్తాయి. అయితే తన ఈజ్‌తో సినిమాలో వేగాన్ని తీసుకొచ్చాడు శర్వానంద్‌. తెరపై కనిపించినంతసేపూ కంప్లీట్‌ ఎనర్జీని ప్రదర్శించడంతో ఆడియన్స్‌ పూర్తిగా సినిమాతో కనెక్ట్‌ అవుతారు. లావణ్య అందం సినిమాకి ప్రధాన ఆకర్షణ. కథ కొత్తదేమీ కాదుగానీ, సినిమా కంప్లీట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకుంటుందని ముందే చెప్పేశాడు హీరో శర్వానంద్‌. అందుకు తగ్గట్టుగానే సినిమా ఉంటుంది. శర్వానంద్‌ని ఇలా సరదా పాత్రల్లో తెరపై చూస్తే భలే ఉంటుంది. ఓవరాల్‌గా పైసా వసూల్‌ సినిమా అనిపిస్తుంది. సినిమాకి బాగా పబ్లిసిటీ చేయడం కలిసొచ్చే అంశం. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
పోలీస్‌ రాధాకృష్ణుడి ఎంటర్‌టైన్‌మెంట్‌ 
అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with richa panay